వైరల్ వీడియో: కొడుకు చేస్తున్న పని చూస్తూ మురిసిపోతున్న హార్దిక్ దంపతులు..!

హార్దిక్ పాండ్య.ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Cricketer Hardik Pandya And Natasa Son Agastya Takes First Steps Video Viral, Cr-TeluguStop.com

టీం ఇండియా క్రికెట్ ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ గా పేరు పొందిన హార్దిక్ పాండ్యా ఎప్పటికపుడు తన ప్రదర్శనతో అభిమానులను ఆక్కటుకుంటూనే ఉంటాడు.అలాగే హార్దిక్ పాండ్యా ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటాడు.

అంతేకాదు హార్దిక్ పాండ్యా భార్య నటాషా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

హార్దిక్ పాండ్యా, నటాషాలకు అగస్త్య కుమారుడు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉండగా మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్ లతో చాలా బిజీగా ఉన్న హార్దిక్ పాండ్యా అనుకోకుండా కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో హార్దిక్ పాండ్యా తన సమయాన్ని మొత్తం కుటుంబ సభ్యులతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.ఈ క్రమంలో తన కొడుకు అగస్త్యకి సమయాన్ని కేటాయించి బుడి బుడి అడుగులు వేసేలాగా నేర్పే ప్రయత్నంలో ఉన్నాడు పాండ్యా.

తాజాగా అగస్త్య చిన్ని చిన్ని బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో ఒకవైపు హార్దిక్ పాండ్యా, మరోవైపు నటాషా కూర్చొని అగస్త్య వేసే చిన్ని చిన్ని బుడి బుడి అడుగులని చూసి తెగ మురిసిపోతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అలాగే హార్దిక్ పాండ్యా, నటాషా ఇద్దరు కూడా అగస్త్య అడుగులు వేసే లాగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం మనం గమనించవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube