హీరోగా గుగ్లీలు వేస్తా అంటున్న బజ్జీ! అది కూడా తమిళంలో  

Cricketer Harbhajan Singh To Make Acting Debut With Tamil - Telugu Cricketer Harbhajan Singh, Kollywood, Make Acting Debut, Tamil

ఇండియాలో క్రికెట్ కి, సినిమాకి దగ్గర సంబంధం ఉంటుంది.ఎక్కువగా టీం ఇండియా క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్స్ తో రిలేషన్ నడపడంతో పెళ్లి కూడా చేసుకుంటారు.

Cricketer Harbhajan Singh To Make Acting Debut With Tamil

అలా చేసుకున్న వారిలో పాతతరం క్రికెటర్స్ నుంచి తాజాగా విరాట్ కోహ్లి వరకు ఉన్నారు.అలాగే ఇప్పుడు ఉన్న ఆటగాళ్ళలో కొందరూ బాలీవుడ్ భామలతో రిలేషన్ తో ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే క్రికెటర్లు కూడా అప్పుడప్పుడు సినిమాలలో గెస్ట్ పాత్రలలో కనిపిస్తూ ఉంటారు.అలాగే ఈ మధ్య వారి బయోపిక్ లతో సినిమాలు వస్తున్నాయి.

అయితే క్రికెటర్స్ లో ఇప్పటి వరకు శ్రీశాంత్ మాత్రమే హీరోగా నటించాడు.

ఇప్పుడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా హీరో అవతారం ఎత్తాడు.

భజ్జీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.తను నటించనున్న సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తన ఖాతాలో షేర్ చేశారు.

భజ్జీ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం పేరు ఫ్రెండ్‌షిప్.అయితే ఇది ఎక్కడో బాలీవుడ్ లో తెరకెక్కుతుంది అనుకునేరు.

అలాంటిది లేదు.ఇది మన సౌత్ లో తమిళంలో తెరకెక్కుతున్న సినిమా.

ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్, షామ్ సూర్య దర్శకత్వం వహించారు.జేపీఆర్ స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా రిలీజ్ అయిన బజ్జీ సినిమా ఫ్రెండ్ షిప్ లో ఇద్దరు వ్యక్తుల చేతులకు బేడీలు వేసి ఉంది.దక్షిణభారతీయ సినిమాలో క్రికెట్ దిగ్గజం ప్రధాన పాత్రలో నటిస్తు్న్నారని హర్భజన్ సింగ్ పోస్ట్ చేసిన పోస్టరులో రాసి ఉంది.

మరి హీరోగా ఈ సినిమాలో బజ్జీ తన సెకండ్ ఇన్నింగ్ లో ఎలా స్టార్ట్ చేస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

  • Cricketer Harbhajan Singh To Make Acting Debut With Tamil Related Telugu News,Photos/Pics,Images..

    footer-test