'ది బాస్‌' గా గేల్..!

క్రికెట్ లో చాలా మందికి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు.వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కి కూడా అలానే చాలా మంది అభిమానులు ఉన్నారు.

 Chris Gayle Replaced The Universal Boss Sticker On His Bat With The Boss Due To-TeluguStop.com

అందుకే ఆయన్ని ‘ యూనివర్స్ బాస్ ‘ గా పలుకుతుంటారు.అలా పిలిచే ట్యాగ్ ఆయనకు ఎవ్వరూ ఇవ్వలేదు.

కానీ ఆయన్ని అలా పిలవడం దానంతట అదే అలవాటైపోయింది.క్రిస్ గేల్ కూడా ఆ బిరుదును తానే పిలిపించుకున్నాడు.

అందుకే ఆయనకు అది చాలా బాగా నచ్చింది.దీంతో ఆయన మ్యాచ్ ఆడే బ్యాట్ మీద కూడా యూనివర్స్ బాస్ అనే స్టిక్కర్ కనపడుతుంది.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో క్రిస్ గేల్ బ్యాట్‌ పై అది కనపడలేదు.మామూలుగా యూనివర్స్‌ బాస్‌ కు బదులు ‘ది బాస్‘ అని ఉండటంతో అందరూ గుసగుసలాడుకున్నారు.

ఈ విషయంపై క్రిస్ గేల్‌ కూడా తన అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చాడు.

క్రిస్ గేల్ యూనివర్స్‌ బాస్‌ గా ఉండటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ అయిన ఐసీసీకి ఇష్టం లేదని తెలిపాడు.

ఐసీసీ తన యూనివర్స్ బాస్ పై అభ్యంతరం తెలిపింది.దీంతో యూనివర్స్‌ బాస్‌ ను తీసేసి ఆయన ‘ ది బాస్‌ ‘ అని మార్చుకున్నట్లు మ్యాచ్ జరిగిన తర్వాత క్లారిటీ ఇచ్చాడు.

యూనివర్స్‌ బాస్‌ అనే పదంపైన ఐసీసీకి కాపీరైట్స్‌ ఉండటం వలన దానిపై తనకు ఆ హక్కు లేదని తెలిపాడు.

Telugu Bcci, Chris Gayle, Chrisgayle, Icc Copy, Latetst, Bat Sticker, Ups, Boss-

తాను ముందే కాపీరైట్స్‌ పొంది ఉండుంటే తనకే ఆ పేరు నిలిచిపోయుండేదని తెలిపాడు.సాంకేతికంగా క్రికెట్‌ లో ఐసీసీయే బాస్‌ కాబట్టి తాను వాళ్లతో పనిచేయనని తెలిపాడు.ఐసీసీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, బ్యాటింగ్‌ లో తానే బాస్‌ అని క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అందరూ షాక్ తిన్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube