వరల్డ్ కప్ స్పెషల్ : అరవీర భయంకరులు... ఈ కరేబియన్లు...  

Cricket World Cup 2019 Special West Indies Team-

మరి కొద్ది రోజుల్లో క్రికెట్ ప్రపంచ కప్ ఆరంభమవబోతుంది. ఇప్పటికే ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు సన్నద్ధం అవుతున్నాయి. మే 30 నుండి ఇంగ్లాండ్ లో ఆరంభం అవబోతున్న ప్రపంచ కప్ కి ఫెవరెట్లు గా బరిలోకి దిగుతుంది ఇంగ్లాండ్ జట్టు. ఇకపోతే ఇంగ్లాండ్ పిచ్ లు బ్యాటింగ్ కి స్వర్గధామంలా ఉంటాయి..

వరల్డ్ కప్ స్పెషల్ : అరవీర భయంకరులు... ఈ కరేబియన్లు...-Cricket World Cup 2019 Special West Indies Team

ఇక్కడ హార్డ్ హిట్టర్ లు క్లిక్ అయితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. ఈ ప్రపంచ కప్ లో హార్డ్ హిట్టర్ లు ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంటే అది వెస్టిండీస్ జట్టే

రెండు సార్లు విశ్వవిజేతలుగా నిలిచిన కరేబియన్ జట్టు ఈ సారి వరల్డ్ కప్ కి నేరుగా అర్హత సాదించలేక , వరల్డ్ కప్ అర్హత మ్యాచ్ లు ఆడి అర్హత సాధించింది. చివరి సారిగా 2016 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో విజేతలుగా నిలిచిన వెస్టిండీస్ జట్టు ఈసారి 50 ఓవర్ ల వరల్డ్ కప్ కి ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది. జాసన్ హోల్డర్ నేతృత్వం లో ఇంగ్లాండ్ లో అడుగు పెట్టె కరిబియన్ జట్టు ని తేలికగా తీసుకోలేము. ఆ జట్టు అంత హార్డ్ హిట్టర్ లతో నిండిపోయింది. అందులో ఏ ఒక్కరైనా చివరి వరకు నిలబడితే భారీ స్కోర్ లు చేయడం ఖాయం.

అరవీర భయాంకరులు

క్రిస్ గేల్ ఈ పెరు చెప్పగానే బౌలర్లకు వణుకు వస్తుంది , ఇతడు కొన్ని ఓవర్లు బ్యాటింగ్ చేస్తే చాలు పరుగుల వరద ఖాయం. ఇటీవల ఇంగ్లాండ్ పైన జరిగిన వన్డే సిరీస్ లో 400 పైగా పరుగులు చేసిన గేల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ప్రపంచ కప్ వెస్టిండీస్ జట్టు ఎక్కువగా గేల్ పైన ఆధారపడి ఉంది. ఇక షిమ్రాన్ హెట్ మేయర్ , ఆండ్రి రస్సెల్ ల గురించి చెప్పనక్కర్లేదు.

ఇటీవల ఐపీఎల్ లో కోల్ కత్తా జట్టు జరుపున ఆడిన రస్సెల్ ఏకంగా 52 సిక్సర్ లు కొట్టి రికార్డ్ సృష్టించాడు. ఇక డారెన్ బ్రావో , షై హోప్ , నికోలస్ పూరన్ వంటి నిలకడైన బ్యాట్స్ మెన్ లతో ఆ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ లో కెప్టెన్ జాసన్ హోల్డర్ , కిమర్ రోచ్ ,నర్స్ , థామస్ లాంటి బౌలర్లు ఉన్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ పిచ్ ల పైన వెస్టిండీస్ బౌలర్లు ప్రభావం చూపగలిగితే ఆ జట్టు అద్భుతాలు చేసే అవకాశాలు ఉన్నాయి..

ప్రపంచ కప్ వెస్టిండీస్ జట్టు ఇదే

క్రిస్ గేల్ , షై హోప్ , డారెన్ బ్రావో , షిమ్రాన్ హెట్ మేయర్ , ఈవిన్ లూయిస్ , కార్లోస్ బ్రాత్వయిట్ , నికోలస్ పూరన్ ,ఆండ్రి రస్సెల్ , జాసన్ హోల్డర్ , కిమర్ రోచ్ , ఫ్యాబిన్ అల్లెన్ , ఆశ్లే నర్స్ , ఓషనే థామస్ ,షెల్డన్ కట్రెల్ , శాన్నిన్ గాబ్రియేల్