కొడుకు ఫోటో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా… సోషల్ మీడియాలో ట్రోలింగ్  

hardik pandya became father before marriage trolls, Cricket, Team India, Natasha, virat Kohli - Telugu Cricket, Hardik Pandya Became Father Before Marriage Trolls, Natasha, Team India, Virat Kohli

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పుత్రోత్సాహంలో ఉన్న సంగతి తెలిసిందే.అతని భార్య నటాషా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

 Cricket Team India Natasha Virat Kohli

బుధవారం నాడు తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హార్దిక్ ప్రకటించాడు.చిన్నారి చేతిని తాను పట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు.

తాజాగా తన కుమారుడిని అందరికీ చూపించాడు.కొడుకుని ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోను షేర్ చేశాడు.

కొడుకు ఫోటో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా… సోషల్ మీడియాలో ట్రోలింగ్-General-Telugu-Telugu Tollywood Photo Image

డెలివరీ రూమ్ లో ఈ ఫొటోను తీసినట్టు కనిపిస్తోంది.కొడుకుని చూసిన ఆనందంలో హార్ధిక్ ముఖం వెలిగిపోతోంది.

ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఫొటోను షేర్ చేసిన గంటల వ్యవధిలోనే 24 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా పెళ్లి కాకుండా కాబోయే భార్య ద్వారా తండ్రి కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

సెలబ్రేటీల జీవితాలలో ఏవైనా ప్రత్యేకంగా జరిగినపుడు ట్రోల్స్ ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా విషయంలో కూడా అలాంటి ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే తన ప్రియురాలికి ఉంగరం తొడిగి హార్దిక్ పాండ్యా సడెన్ గా నిశ్చితార్ధం అయిపోయినట్లు చెప్పాడు.

అప్పటికే ఆమె గర్భావతిగా ఉంది.అయితే పెళ్లి చేసుకుందామని అనుకున్న కరోనా సిచువేషన్ వలన హోల్డ్ లో ఉండిపోయాడు.

అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లి కాకుండానే తండ్రి అయిపోయాడు.దీనిపై నెటిజన్లు చాలా భిన్నంగా స్పందిస్తున్నాడు.

ఎక్కడైనా సిక్స్ లు ఎంత ఈజీగా కొట్టాలో హార్దిక్ కి బాగా తెలుసు.హార్దిక్ స్పీడ్ చూసి విరాట్, అనుష్క ఒకసారి ఆలోచించాలి అంటూ నెటిజన్లు ఫన్నీగా అతనిని ట్రోల్ చేస్తున్నారు.

.

#Virat Kohli #Cricket #Natasha #Team India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cricket Team India Natasha Virat Kohli Related Telugu News,Photos/Pics,Images..