మళ్లీ బ్యాట్ తో మైదానంలో కనిపించనున్న అలనాటి క్రికెట్ దిగ్గజాలు..!

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు మళ్లీ మైదానం లో అడుగు పెట్టనున్నారు.దీంతో వారి ఆటను వీక్షించడానికి క్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో వెయిట్ చేస్తున్నారు.

 Cricket Legends Of All Time Will Appear On The Field With The Bat Againcricket,-TeluguStop.com

రాంచీలో మార్చి 2 నుంచి 21 వరకు జరగనున్న  అన్అకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ టూర్ టీ 20 (Unacademy Road Sefty World Tour T20) ఈవెంట్ లో ఈ క్రికెట్ దిగ్గజ ధీరులు భాగస్వాములు కానున్నారు.దీని ఫస్ట్ ఎడిషన్ గతేడాది మార్చి 11వ తేదీన కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

ఐతే మంగళవారం రోజు మాట్లాడిన నిర్వాహకులు రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన 65,000 సామర్థ్యం గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో మిగిలిన మ్యాచ్‌లన్నీ జరగనున్నట్లు ప్రకటించారు.

Telugu Statium, Batsman, Cricket, Sunil, Unacademyroad-Latest News - Telugu

అయితే ఈ టీ20 మ్యాచ్లు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశ్యం రోడ్ సేఫ్టీ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికేనని నిర్వాహకులు చెబుతున్నారు.భారతదేశం రోడ్ల పై ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని.అయితే ఇది ప్రజల నిర్లక్ష్యం కారణం గానే జరుగుతోందని.

అందుకే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రజల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ క్రికెట్ సిరీస్ ద్వారా తెలియజేయనున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇకపోతే ఈ టోర్నీ కి సునీల్ గవాస్కర్ కమిషనర్ గా వ్యవహరిస్తుండగా సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు మహారాష్ట్ర రోడ్డు సేఫ్టీ సెల్ చొరవ తీసుకొని ప్రజల్లో రోడ్డు సేఫ్టీ అంశం పై అవేర్నెస్ పెంచాలి అని ఈ టీ 20 సిరీస్ కి శ్రీకారం చుట్టింది.

ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఇండియా దేశాల క్రికెట్ ఆటగాళ్లు పాల్గొననున్నారు.శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్ కూడా ఈ సిరీస్ లో ఆడనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube