Cricket: జో రూట్‌ టాలెంట్ కి ముచ్చటపడి వెం‍డి బ్యాట్‌ బహుమతిగా ఇచ్చారు.. ఎక్కడంటే!

జో రూట్‌.ఈమధ్యకాలంలో మంచి ఫామ్ లోకి వచ్చి అందరి మన్ననలు పొందుతున్న ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌.

 Cricket Joe Root Was Fond Of The Talent And Gifted A Silver Bat-TeluguStop.com

ఇతడు ఇంగ్లాండ్ టెస్టు జట్టుకి మాజీ కెప్టెన్‌ అన్న సంగతి అందరికీ తెలిసినదే.జో రూట్‌ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

కొంతకాలం క్రితం కెప్టెన్సీ నుండి భారం తొలగిన తర్వాత మరింత స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపిస్తూ తన సత్తా చాటుతున్నాడు.ఈ క్రమంలో ఇటీవల సొంత దేశంలోనే న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో రూట్‌ తొలి టెస్టు సందర్భంగా 26వ టెస్టు సెంచరీ నమోదు చేసి, రికార్డులకెక్కాడు.

ఈ సెంచరీ చేయడం వలన అతడు టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని ఈజీగా చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియాతో రీషెడ్యూల్డ్‌ టెస్టు మ్యాచ్‌కు ముందుగానే జూ రూట్‌ ఓ అరుదైన బహుమతి అందుకున్నాడు.

అవును.ఈ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ వెండి బ్యాట్‌ కానుకగా అందుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను ICC తాజాగా సోషల్‌ మీడియా షేర్‌ చేయగా వైరల్ అవుతోంది.నెటిజన్లు మనోడిని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇలాగే మరిన్ని అరుదైన, అందమైన, విలువైన కానుకలు అందుకోవాలని నెటిజన్లు అతగాడిని దివిస్తున్నారు.

Telugu Cricket, Englands Batter, Joe Root, Zealand, Silver Bat, Ups, Latest-Late

ఇకపోతే, కివీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అతడు తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులతో అజేయంగా నిలిచి, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.దాంతో జో రూట్‌ 10,000 మార్కు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అదే కివీస్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ వైట్‌వాష్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించి న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌తో సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌గా నిలిచాడు.

ఈ సందర్భంగా అతగాడు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube