దూసుకొస్తున్న రాకెట్లు.. భారతీయ శాస్త్రవేత్తలను ఆదుకున్న ఇజ్రాయెల్ క్రికెట్ క్లబ్

ఇజ్రాయెల్‌- పాలస్తానాల మధ్య గత కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తీవ్రరూపు దాల్చింది.హమాస్ తీవ్రవాద సంస్థ రాకెట్లతో దాడి చేస్తుంటే.

 Cricket Club Comes To Rescue Of Indian Researchers In Southern Israeli City Under Attack From Hamas-TeluguStop.com

దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది.ముఖ్యంగా హమాస్ నేతలు, సొరంగాలే టార్గెట్‌గా చేసుకుని వైమానిక దాడులు నిర్వహిస్తోంది.

సోమవారం గాజా స్ట్రిప్‌పై దాడి చేసి 9 మంది హమాస్ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది.దీంతో హమాస్ తన బలగాలను, ముందుగుండు సామాగ్రిని సొరంగాల ద్వారా మరో చోటుకు తరలిస్తోంది.

 Cricket Club Comes To Rescue Of Indian Researchers In Southern Israeli City Under Attack From Hamas-దూసుకొస్తున్న రాకెట్లు.. భారతీయ శాస్త్రవేత్తలను ఆదుకున్న ఇజ్రాయెల్ క్రికెట్ క్లబ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గాజా, ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది పాలస్తీనియన్లు చనిపోయారని ఓ అంచనా.అయితే గాజా దాడుల్లో.

ఇజ్రాయెల్‌కు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని పాలస్తీనా అంటోంది.

అటు ఈ దాడుల్లో విదేశీయులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.

భారత్‌లోని కేరళకు చెందిన సౌమ్య సంతోష్ పాలస్తీనా బలగాలు చేసిన రాకెట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.భారత్‌లో ఉన్న భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.

పాలస్తీనా దళాలు రాకెట్ దాడి చేశాయి.వాటిలో ఒక రాకెట్ సౌమ్య ఇంటిపై పడటంతో ఇళ్లు నేలమట్టమై ఆమె మరణించారు.

ఆమె మృతదేహాన్ని శనివారం సౌమ్య స్వగ్రామం ఇడుక్కికి తీసుకెళ్లారు.అక్కడి ఒక చర్చిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

దీనిపై ఇజ్రాయెల్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో వున్న భారత సంతతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

స్థానిక బెన్ గురియన్ యూనివర్సిటీలో పలువురు భారత పరిశోధకులు చిక్కుకుపోయారు.గాజా నుంచి దూసుకువస్తున్న రాకెట్ల నుంచి కాపాడుకునేందుకు సరైన రక్షణ లేక వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

ఈ క్రమంలో యూనివర్సిటీ పక్కనే ఉన్న బీర్షెబా క్రికెట్ క్లబ్ భారత పరిశోధకులకు ఆశ్రయం కల్పించింది.నెగెవ్ దక్షిణ ప్రాంతంలోని ఈ క్రికెట్ క్లబ్ కు చెందిన రెండంతస్తుల భవనంలో భూగర్భంలో తలదాచుకునే సౌకర్యం ఉంది.

భారత పరిశోధకులు యూనివర్సిటీలో చిక్కుకుపోయారని తెలియడంతో క్రికెట్ క్లబ్ వెంటనే స్పందించింది.

Telugu Beersheba Cricket Club, Ben Gurion University, Hamas Commanders, Israel, Soumya Santosh-Telugu NRI

భారత పరిశోధకుల్లో కొందరు తమ క్లబ్‌లో క్రికెట్ ఆడేందుకు వస్తుంటారని, వారు కూడా తమ కుటుంబ సభ్యుల వంటివారని బీర్షెబా క్రికెట్ క్లబ్ చైర్మన్ వెల్లడించారు.భారతీయులకు ఇక్కడి పరిస్థితుల గురించి తెలియదని, దాంతో, ఇజ్రాయెల్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాను, తన సహచరులు వారికి అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.కాగా, విపత్కర పరిస్ధితుల్లో తమను ఆదుకున్న బీర్షెబా క్రికెట్ క్లబ్ యాజమాన్యానికి భారత పరిశోధకులు విరాజ్ భింగార్దివే, హీనా ఖంద్, శశాంక్ శేఖర్, రుద్రారు సేన్ గుప్తా, బిష్ణు ఖంద్, అంకిత్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు.

#BenGurion #Israel #Soumya Santosh

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు