క్రికెట్ లో ట్రాన్స్ జెండర్స్ కి చోటు అంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ని ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొన్ని వందల కోట్ల మంది క్రికెట్ ని అభిమానిస్తూ, చూస్తూ ఉంటారు.అలాంటి క్రికెట్ జెంటిల్ మెన్ గేమ్ మొన్నటి వరకు మగవారికి మాత్రమే ఉండేది.

 Cricket Australia Launches Transgender And Gender Diversity Policy-TeluguStop.com

తరువాత ఆడవారికి కూడా క్రికెట్ లో ప్రాధాన్యత పెరగడంతో ఇప్పుడు ఆడవాళ్ళ క్రికెట్ లో కూడా అధికారికంగా అంతర్జాతీయ టోర్నీలు నిర్వహిస్తున్నారు.ఆడవాళ్ళ క్రికెట్ లో రాణించే మహిళ క్రీడాకారులకి మంచి గుర్తింపు వస్తుంది.

ఇప్పుడు అంధుల క్రికెట్, వికలాంగుల క్రికెట్ ని కూడా క్రికెట్ సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి.ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయంలో మరో అడుగు ముందుకి వేసింది.

వివక్షలను రూపుమాపేలా ఓ వినూత్న ఆలోచనకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెర తీసింది.మెన్, ఉమెన్స్‌ కి మాత్రమే పరిమితం అయిన క్రికెట్ లో ఇకపై లింగ వివక్షకు అవకాశం లేకుండా ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌ ఆడే అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది.

ట్రాన్స్‌జెండర్లను కూడా జట్టులో ఆడించాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది.ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేస్తూ హ్యాష్‌టాగ్‌ను జతచేసింది.క్రీడల్లో లింగ సమానత్వాన్ని పెంపోదించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది.అయితే ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదో తెలివి తక్కువ పని అని విమర్శిస్తున్నారు.

అలాగే ట్రాన్స్ జెండర్స్ ని క్రికెట్ లో ఆడిస్తే ఆడవాళ్ళతో ఆడిస్తారా, మగవాళ్ళతో ఆడిస్తారా అని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.మరి వీటికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube