ఒక సినిమా హిట్ అయింది అంటే దాని వెనక సినిమాకు సంబంధించిన ఆ టీం మొత్తం కష్టం ఉంటుంది.కానీ కొంతమంది మాత్రం వాళ్లకే క్రెడిట్ రావాలనే ఉద్దేశంతో ఆ సినిమా మొత్తం మా వల్లే ఆడింది అనే ఒక భావనతో ఉంటారు.
అంటే వాళ్ల దృష్టిలో వాళ్ళే గ్రేట్ వాళ్ళు లేకపోతే సినిమా ఉండేది కాదు అనేది వాళ్ళ అభిప్రాయం అయితే కొన్ని సందర్భాల్లో ఇలా అనుకునే వాళ్ళు హీరోలు అవ్వచ్చు, లేదా డైరెక్టర్లు కూడా అవ్వచ్చు.

ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా ఆడింది అంటే అది నా వల్లే ఆడింది అంటారు.కానీ అలా అనకుండా అందతా టీం క్రెడిట్ అనే భావించాలి గాని మా ఒక్కరి వల్లే ఆడింది అంటే మాత్రం అది కరెక్ట్ అయిన విషయం కాదు అనే చెప్పాలి.ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ లో అందరి పాత్ర ఉంటుంది అనేది అందరూ తెలుసుకోవాలి.
లేకపోతే సక్సెస్ అనేది రావడం చాలా కష్టం అవుతుంది కొంతమంది డైరెక్టర్లు వాళ్ల సినిమాలు వాళ్ల వల్ల నే హిట్ అయ్యాయి అని అనుకోవడం వల్ల ఆ తర్వాత ఫ్లాపులు వచ్చి ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అవ్వాల్సి వచ్చింది.అలాంటి డైరెక్టర్ ఎవరంటే శ్రీను వైట్ల( Srinu vaitla ) అనే చెప్పాలి.

ఈయన తీసిన సినిమాలకి రైటర్లు చాలా కష్టపడి కథ, మాటలు రాసినప్పటికీ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా ఈయనే దొబ్బేసి అన్ని నేనే రాసుకున్నాను.నా వల్లే ఈ సినిమా హిట్ అయింది అనే భావనలో ఉన్నాడు అందుకే ఆయన చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది.ఇక ఈయనతో పాటుగా బోయపాటి శీను కూడా రైటర్లకి పెద్దగా క్రెడిట్ ఇవ్వడు అన్ని తనే దగ్గరుండి చేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు.మ్యూజిక్ విషయంలో కూడా తానే ఇన్ పుట్స్ ఇచ్చాను అని లెజెండ్( Legend ) ఆడియో ఫంక్షన్ లో చెబితే ఆ స్టేజి మీద నే దేవి శ్రీ ప్రసాద్ ఆయనకి కౌంటర్ ఇవ్వడం జరిగింది.
ఇలా ఒక సినిమా సక్సెస్ లో వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్టుగా భావిస్తారు గాని అంత టీం వర్క్ అని మాత్రం ఎవరూ చెప్పరు.అందుకే ఇండస్ట్రీలో నుంచి చాలామంది ఫేడ్ అవుట్ అవుతున్నారు…
.