క్రెడిట్ కార్డు బిల్లు ఎగ్గొట్టినవారిని పట్టుకోవడానికి వాట్సాప్ బ్లూ టిక...! ఎలాగో తెలుస్తే షాక్!       2018-06-17   01:33:34  IST  Raghu V

క్రెడిట్ కార్డు తీసుకొని బిల్ ఎగ్గొడుతుంటారు కొంతమంది. తప్పు అడ్రస్ ఇస్తారు, పట్టుకుందామంటే దొరకరు. అలంటి ఒకర్ని వాట్సాప్ ద్వారా పట్టుకుంటే కొత్త ట్రిక్ కనిపెట్టింది బ్యాంకు యాజమాన్యం. అసలేమైందో వివరాలు చూడండి!

-

ముంబైకి చెందిన రోహిత్ జాదవ్ 2010లో SBI బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. రూ.85 వేల వరకూ ఖర్చు చేశాడు. వడ్డీతో కలిపి రూ.1.17 లక్షలు అయింది. అప్పటి నుంచి రోహిత్ ఫోన్ నంబర్లను మారుస్తూ ఇంటి అడ్రస్ మారుస్తున్నాడు. దీంతో రోహిత్ కు లీగల్ నోటీస్ అందజేయడం కష్టం అయ్యింది. చివరికి రోహిత్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసిన బ్యాంక్ అధికారులు అతనికి వాట్సాప్‌ లో PDF ఫైల్ ద్వారా లీగల్ నోటీస్‌ పంపారు. దాన్ని అతను ఓపెన్ చేయగా.. అందులో బ్లూ టిక్స్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మెసేజ్‌ స్క్రీన్ షాట్ తీసి బ్యాంక్ తన దగ్గర ఉంచుకుంది.

ఈ బ్లూ టిక్స్ ఆధారంగా బాంబే హైకోర్టులో రోహిత్ పై బ్యాంక్ కేసు వేసింది. తాము పంపిన లీగల్ నోటీస్‌ జాదవ్ చూశాడని, దానికి వాట్సాప్‌ లో ఉన్న బ్లూ టిక్స్ సాక్ష్యం అని బ్యాంక్ ప్రతినిధులు స్క్రీన్ షాట్‌ ను కోర్టుకు సమర్పించారు. కోర్టు దాన్ని ఆమోదించింది. డిజిటల్ మీడియా ద్వారా పంపే మెసేజ్‌ లేదా లీగల్ నోటీసుల వంటి డాక్యుమెంట్లు చట్ట ప్రకారం చెల్లుతాయని స్పష్టం చేసింది. వాటిని లోన్ కట్టవలసిన వ్యక్తి స్వీకరించినట్లు వాట్సాప్‌లో బ్లూ టిక్ తెలియజేస్తుంది కనుక.. అది కూడా చెల్లుతుందని కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రోహిత్ కోర్టులో హాజరు కావాలని, బ్యాంక్ కు చెల్లించాల్సిన బిల్లును వడ్డీతో కలసి కట్టాలని బ్యాంక్ తీర్పు చెప్పింది. లేకపోతే జైలుకి పంపాల్సి వస్తుందని హెచ్చరించింది

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.