కాఫీ తాగ‌డానికే కాదు.. ఇలా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు!

Creative Ways To Use Coffee! Creative Ways, Use Coffee, Coffee, Latest News, Coffee Tips, Lifestyle, Home Garden,

ప్రపంచ‌వ్యాప్తంగా చాలా మంది అమితంగా ఇష్ట‌ప‌డి తాగే పానియాల్లో కాఫీ ముందుంటుంది.కొంద‌రికైతే ఉద‌యాన్నే బెడ్‌ కాఫీ తాగ‌నిదే.

 Creative Ways To Use Coffee! Creative Ways, Use Coffee, Coffee, Latest News, Cof-TeluguStop.com

రోజు కూడా గ‌డ‌వ‌దు.అంత‌లా కాఫీకి ఎడిక్ట్ అవుతుంటారు.

కాఫీని లిమిట్ తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.పైగా, ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి.

బ‌రువు త‌గ్గించ‌డంలో, డిప్రెష‌న్‌ను దూరం చేయ‌డంలో, క్యాన్స‌ర్ క‌ణాల‌ను అంతం చేయ‌డంలో, మైండ్‌కు రిలాక్స్ చేయ‌డంలో కాఫీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అయితే ఇక్క‌డ మీరు తెలుసుకోవాల్సి విష‌యం ఏంటంటే.

కాఫీ కేవ‌లం తాగ‌డానికే కాదు.మ‌రిన్ని విధాలుగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా అప్పుడుప్పుడు ఫ్రిజ్‌లో దుర్వాసన వ‌స్తూ ఉంటుంది.

ఏవైనా ఫుడ్ ఐటెమ్స్‌ను ఓపెన్‌గా పెట్ట‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంది.ఆ స‌మ‌యంలో కాఫీ గింజ‌లు ఒక బౌల్‌లో వేసి.

ఫ్రిజ్‌లో ఏదో ఒక మూల‌న పెట్టిన‌ట్టైతే.బ్యాడ్ స్మెల్ చాలా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది.

Telugu Coffee, Coffee Tips, Creative Ways, Latest, Lifestyle-Telugu Health - త

అలాగే అంద‌రి ఇళ్ల‌ల్లో చీమ‌లు కామ‌న్ క‌నిపిస్తుంటారు.అయితే చీమ‌ల‌ను త‌రిమి కొట్ట‌డంలో కాఫీ పౌడ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.చీమ‌లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంలో కాఫీ పౌడ‌ర్ లేదా కాఫీ గింజ‌లు వేయాలి.ఇలా చేస్తే చీమ‌లు బెడ‌ద నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అలాగే ఇంటి కార్నర్ పాయింట్స్ లో కాఫీ పౌడ‌ర్ చ‌ల్లితే.రూం ఫ్రెషనర్‌గా పనిచేసి గదిని సువాసనభరితం చేస్తుంది.

ఇక కాఫీ పౌడ‌ర్ మొక్క‌ల‌ను ఎరువుగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.అవును, మొక్క‌ల‌ను కాస్తంత కాఫీ పౌడ‌ర్‌ను వేస్తే గ‌నుక‌.అందులో ఉండే ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి మొక్క‌ల ఎదుగుల‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే కాఫీ పౌడ‌ర్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి.

బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.చ‌ర్మంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube