పీడ కలలు ఎక్కువగా అలాంటివారికి వస్తాయట

ఏదైన ఒక టాపిక్ … ఒక మామూలు ఉద్యోగస్తుడికి ఇవ్వండి, అలాగే ఒక కవికి ఇవ్వండి.అది సామాజిక సమస్య కావచ్చు, మానసిక విశ్లేషణ కావచ్చు.

 Creative People Are More Likely To Experience Nightmares-TeluguStop.com

ఇద్దరిలో ఎవరు లోతుగా, మనం అలోచించలేని విధంగా వివరిస్తారు? అందులో అనుమానం అక్కరలేదు.కవి వివరణ, విశ్లేషణ లోతుగా ఉండే అవకాశం ఉంటుంది.

ఒక రచయిత, ఒక శాస్త్రవేత్త .ఇలాంటివారు ప్రతీ చిన్న విషయాన్ని చాలా డీటేల్డ్ గా చూస్తారు.వీరిలో భావోద్వేగాలు మిగితా వారికన్నా ఎన్నోరేట్లు ఎక్కువుంటాయి.

విజయాల్ని ఆస్వాదించే తీరు, భయాలతో పోరాడే తీరు వేరుగా ఉంటాయి… ఒక విషయాన్ని వారు చూసే విధానం వేరుగా ఉంటుంది.

మామూలు మనిషులకన్నా వేగంగా, కొత్తగా అలోచిస్తారు.ఇక చెప్పలేం కాని, మనకు ఊహకు అందనిది ఏదో వారి మెదడులో జరుగుతూ ఉంటుంది.ఇలాంటి వారినే మనం క్రియేటివ్ పీపుల్ అని అంటాం.అయితే ఇలాంటివారికే పీడకలలు ఎక్కువగా వస్తాయట.

కెనడాలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం బయటపడింది.మామూలు వ్యక్తులు తమ కలల్లో సాధరణంగా మనం రోజు చూసే విషయాలనే చూస్తే, క్రియేటివ్ మనుషుల క్రియేటివిటి కలలో కూడా కొనసాగుతుందట.

ఎలాగో వారి ఊహాశక్తి మిగితా మనుషులతో పోలిస్తే చాలా పెద్ధది.ఈ కారణంగానే, మనం రోజువారి జీవితంలో చూడని సంఘటనలు, భావోద్వేగాలు, ఆకారాలు … ఇలాంటివెన్నో వారు కలలో తమకు తెలియకుండానే ఊహించేసుకుంటారట.

అవి అసాధారణం కాబట్టే భయాన్ని కలిగించేలా ఉంటాయి.అవే పీడకలలు.

అలాగని వారు ప్రతీసారి భయంకరమైన వాటినే ఊహించుకోరు.వారికి అందమైన ఊహలు కూడా వస్తాయి.

అవి గుర్తుంటే మనకి అందమైన కథలు, అందమైన ఆవిష్కరణలు ఎన్నో దొరుకుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube