Manchu Family : ఈ ఫ్యామిలీ కి ఇదేం పాడు బుద్ది.. ఎప్పుడు అడ్డంగా బుక్ అవుతునే ఉంటారు

నిజంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి అంటే సినిమా ఇండస్ట్రీలో మీకు ఏ కుటుంబం అంటే ఇష్టం చెప్పండి.చెప్పడం కష్టమైతే ఏ కుటుంబం పైన ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయో అదైనా చెప్పండి.

 Crazy Trolling On Manchu Family-TeluguStop.com

ఇదైతే చెప్పడం చాలా సింపుల్ గురు మంచు ఫ్యామిలీ అంటారు అంతే కదా.మంచు ఫ్యామిలీ అనగా ట్రోలింగ్ ఫ్యామిలీ అంటే కరెక్ట్ గా ఉంటుంది.కుటుంబం పైన అంత ట్రోలింగ్ మరెవరి పైన కాదు ఎందుకంటే వీరు చేసే పనులు అలా ఉంటాయి మరి.మొట్టమొదట మోహన్ బాబు( Mohan Babu ) వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది ఆయనను మాట్లాడించాలంటేనే జనాలు భయపడతారు ఏదో సీరియస్ గా జీవితంలో ఎంతో సాధించిన వ్యక్తిగా, తను మాత్రమే పద్ధతికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా వ్యవహరించడంతో ప్రతి ఒక్కరికి ఆయన ట్రోల్ కంటెంట్ గా దొరికిపోతూ ఉంటారు.

Telugu Manchu-Movie

నిన్నటికి నిన్న అక్కినేని శత జయంతి ఉత్సవాలలో( Akkineni centenary celebrations ) మోహన్ బాబు పక్కన కూర్చున్న జయసుధ( Jayasudha ) ఫోన్లో ఏదో చూస్తూ ఉంటే కోపంగా ఫోన్ లాక్కొని మరీ మూసేస్తు ఉన్నాడు.ఆయన పక్కన కూర్చున్న వాళ్లు కూడా ఫోన్ చూడకూడదు అని లాక్కోవడం ఏంటో అర్థం కాలేదు.జనాలు దీనిని పట్టుకుని వైరల్ చేసి పడేశారు.ఇలా ప్రతీసారి ఏదో ఒకటి చేసి లేదా ఏదో ఒకటి తిక్క తిక్కగా మాట్లాడి ఆయన మీడియాకు పని చెబుతూ ఉంటారు.

ఆయన ఎలాగూ మారారు వయసైపోయింది పోనీ ఆయన పిల్లలైనా అందరిలా ఉన్నారా అంటే అది కాదు.వారేంటో వారి ప్రవర్తన ఏంటో దేవుడికి తెలియాలి.మరీ ముఖ్యంగా మంచు లక్ష్మి( Manchu Lakshmi ) గురించి ఈ విషయంలో మాట్లాడుకోవాలి.

Telugu Manchu-Movie

అమ్మ సైతం సైమా అవార్డ్స్( Saima Awards ) ఫంక్షన్ లో మీడియా ముందు మాట్లాడుతూ కేవరాలకు అడ్డంగా వచ్చిన వ్యక్తి వీపు పై ఒక్కటి చరిచింది.బేసిక్ కామన్ సెన్స్ లేదు అంటూ కెమెరాకు అడ్డు వస్తున్న వారిపై విసుగ్గా మాట్లాడింది ఈ ప్రవర్తనతో అక్కడున్న యాంకర్ కి షాక్ అవ్వడం ఆమె వంతయ్యింది.ఇక మొదట్నుంచి ఇంగ్లీష్ విషయంలో దారుణంగా ట్రోల్ కి గురవుతూ వస్తోంది ఈ అక్షరాన్ని రోల్ చేయాలి అంటూ ఆమె చేసే కామెడీ మామూలుగా ఉండదు.

విష్ణు సైతం ప్రతిసారి ఇది ఏదో మాట్లాడబోయి మరి ఏదో మాట్లాడే కెమెరాలకు చిక్కుతూ ఉంటాడు.ఈ విషయంలో మంచు మనోజ్ కాస్త బెటరా అనుకుంటే అతడికి ఎక్కడ ఏం మాట్లాడాలో అసలు తెలియనే తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube