యోగా మీద ఉండే విచిత్రమైన అపోహలు  

Crazy Myths About Yoga-

“బంచిక్ బంచిక్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా” అంటూ ఏదో సినిమాశైలిలో యోగా చేయమని చెప్పాడు ఓ సినీకవి.ఈ యోగా అనేది భారతీయుల సంపద.కాని నేడు మనవాళ్ళ కన్నా, పరాయిదేశాల్లోనే యోగా ఎక్కువగా చేస్తున్నారు.హాలివుడ్‌లో భారి ఫాలోయింగ్ ఉన్న ఎమ్మా వాట్సన్‌ అనే నటి ఒక సర్టిఫైడ్ యోగా గురువు.కుర్రాళ్ళ మతులు పోగొట్టే ఈ అమ్మడు అందం, ఆరోగ్యం వెనుక యోగా సహాయం ఎంతగానో ఉందట.

Crazy Myths About Yoga---

ఇక మీరే అర్థం చేసుకోండి, విదేశాల్లో మన యోగాకి ఉన్న క్రేజ్.మనవాళ్ళు పట్టించుకోవట్లేదనే “ఇంటర్నేషనల్ యోగా డే” అంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడి.ఈ యోగా మీద కొన్ని విచిత్రమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి.యోగాకి అనుకున్నంతగా ఆదరణ లేకపోవడానికి ఇవి కూడా కారణమేమో!* యోగా హిందూ మతానికి సంబంధించిందని, దాన్ని వేరే మతస్తులు చేయకూడదని భావించే వారు ఉన్నారు.యోగా మతప్రచారానికి చేసేది కాదు.మానసిక, శారీరక ఉల్లాసానికి చేసేది.* ఆడవారు మాత్రమే యోగా చేయాలి, పురుషులు జిమ్ మాత్రమే చేయాలి అనే సిల్లి థాట్ లో బ్రతికేస్తుంటారు కొందరు.

యోగా ఆడవారికి కోసం స్పెషల్ గా భూమ్మిదికి దిగిరాలేదు.మగవారు యోగా చేస్తే అది చిన్నతనం కాదు.* యోగా అంటే ఒక ధ్యానం అని అనుకుంటారు కొంతమంది.వారికి తెలియని విషయం ఏమిటంటే, రకరకాల సమస్యలకి రకరకాల ఆసనాలు ఉంటాయి.యోగాలో ఎన్నోరకాలు.* యోగా యుక్తవయస్సులోనే చేయాలి అనుకోవడం తప్పు.శరీరం సహకరించినంత వరకు, అనుకూలించిన ఆసనాలు అన్ని వేయొచ్చు.* యోగా వలన వక్షోజాలు లూజ్ అయిపోతాయి అనే అపోహ కూడా ఉంది.దానికి పూర్తి వ్యతిరేకంగా, వక్షోజాలను స్థిరంగా, గట్టిగా, మంచి షేప్ లో ఉంచే ఆసనాలు యోగాలో చాలా ఉన్నాయి.