ఈ మేనిఫెస్టో చదివితే పిచ్చెక్కిపోతుంది.. !

ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలు ఇచ్చే హమీలతో చెవులు చిల్లులు పడిపోతుంటాయి.ఇక ఓటర్లను మభ్యపెట్టేందుకు మేనిఫెస్టోలు అంటూ పార్టీలు చేసే హడావుడి మామూలుగా ఉండదు.

 Crazy Manifesto By Tamilnadu South Madurai Independent Contestant Saravaran , Ta-TeluguStop.com

అవి వింటుంటే అసలు ఇవి సాధ్యమా అనే అనుమానాలు కలిగేలా మేనిఫెస్టోలు ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం చదవబోయే మేనిఫెస్టో మెంటల్ కలిగించేలా ఉంది.

ఈ మేనిఫెస్టోను తమిళనాడులోని దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శరవరణ్ అనే వ్యక్తి ప్రకటించారు.ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో ఉన్న ఈ మేనిఫెస్టోను చూస్తే.

తన నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్ ల వారీగా చంద్రమండలానికి తరలించడం కోసం స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడం.ఆడవాళ్లకు పనిలో సాయంగా ఉండేందుకు ఇంటింటికీ ఓ రోబోను పంపిణీ చేయడం.

మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కాలువలు తవ్వించడం.ఇంటికో బోటు ఇవ్వడం.300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండను నిర్మించి ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడటం.కృత్రిమ సముద్రాన్నే సృష్టించి బీచ్ ఏర్పాటు చేయడం.

తన నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ అందించడం వంటి హమీలను తన మేనిఫెస్టోలో వెల్లడించిన ఈ నాయకున్ని చూస్తుంటే ఏం అనాలో అర్ధం కావడం లేదట ఈ నియోజకవర్గ ప్రజలకు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube