క్రేజీ ఐడియా: ట్రాఫిక్ వడపావ్.. రూ.2లక్షల ఆదాయం.. ఎలా అంటే..?!

పెద్ద పెద్ద నగరాలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే సమయంలో ట్రాఫిక్ సమస్యను ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉంటారు.ముఖ్యంగా మెట్రో సిటీస్ లలో అయితే మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.

 Crazy Idea Traffic Filter Rs 2 Lakh Income How Is That, Traffic Vada Pav, Delive-TeluguStop.com

ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతే దాదాపు 3 – 4 గంటల సమయం పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక మనం ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ లో ఉండి పోయినప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని వేరే రూట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు.

థానే కు చెందిన గౌరవ్ అనే వ్యక్తికి ట్రాఫిక్ జామ్ లో ఉన్న సమయంలో ఒక మంచి బిజినెస్ ఐడియా రావడంతో నెలకు దాదాపు 2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే

ఓ రోజు గౌరవ్ ముంబై వెళుతున్న తరుణంలో ట్రాఫిక్ జామ్ లో దాదాపు నాలుగు గంటలపాటు ట్రాఫిక్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ తరుణంలో అదే మార్గంలో బఠానీలు విక్రయిస్తున్న వ్యక్తిని చూసి గౌరవ్ కు ఒక ఆలోచన తట్టింది.ఇలా ట్రాఫిక్ జామ్ లో బఠానీలు అమ్మినట్లు వడాపావ్ కూడా అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచన అతనికి వచ్చింది.

దీనితో అనుకున్నట్లే తన ఉద్యోగానికి రాజీనామా చేసి “ట్రాఫిక్ వడాపావ్” అనే బిజినెస్ ను మొదలు పెట్టాడు.దానితో పాటు చాలా ఫ్రెష్ టేస్టీగా ఉండే వడాపావ్ ప్యాకెట్స్ లో పాటు ఒక చిన్న వాటర్ బాటిల్ ను కూడా అమ్మడం మొదలు పెట్టాడు.

ఆ ప్యాకెట్ ను కేవలం 20 రూపాయలుగా నిర్ణయించి ట్రాఫిక్ రద్దీగా ఉండే సాయంకాల సమయంలో నిర్వహించడం ద్వారా నెలకు 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.

ఈ సందర్భంగా గౌరవం మాట్లాడుతూ 2009 లో తాను ఓ పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేసే వాడిని, నా డెలివరీ వర్క్స్ సాయంత్రం 6 గంటల లోపు పూర్తి అయిపోయేది.

ఇక అక్కడి నుంచి ఇంటికి రావడానికి చాలాసార్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే వాడినని, ఆ సమయంలో బాగా ఆకలి వేసేదని.కానీ, తినడానికి అక్కడ ఏమి దొరికేది కాదు.

కానీ పది సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ లో ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ అనుభవం కూడా ఒక మంచి అనుభంగా నిలిచింది అంటూ గౌరవ్ తెలియజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube