అనిల్ రావిపూడితో మహేష్ మరో సినిమా.. ఈసారి సరికొత్తగా?

టాలీవుడ్ లో మహేష్ బాబు వరుస ఆఫర్ లతో బాగా దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు.

 Crazy Buzz Mahesh Ready To Do A Experimental Movie With Anil Ravipoodi, Mahesh B-TeluguStop.com

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి బయట పడేలా తెరకెక్కించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చాలా రోజుల నుండి దుబాయ్ లో షూటింగ్ జరుగగా ఇటీవలే పూర్తి కాగా.హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ సినిమా బృందం.ఇక మరో పాటకోసం త్వరలోనే గోవాకు వెళ్లనున్నారు.ఈ సినిమా గత ఏడాది కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యంగా మొదలయ్యింది.

దీనివల్ల ప్రస్తుతం విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఇదిలా ఉంటే మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఓకే చేసినట్లు తెలిసింది.ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా తర్వాత చత్రపతి శివాజీ తీయనున్నట్లు వార్తలు వినిపించగా.

ఈ సినిమాలో మరో స్టార్ హీరోను ఎంపిక చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక మరో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథను మహేష్ బాబు విని ఇంప్రెస్ అయ్యాడట.

అంతే కాకుండా ఈ సినిమా ప్రయోగాత్మకంగా రానుందట‌.ఇక ఈ సినిమా గురించి మహేష్ బాబు ఏం చెబుతాడో ఎదురు చూడాల్సిందే.

మరో దర్శకుడు వెంకీ కుడుముల మహేష్ బాబుకు ఓ కథను వినిపించగా కథ నచ్చినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube