కూటమిలో ముసలం....“కాంగ్రెస్ ,టీడీపీ” పొత్తు కష్టమే..

కేసీఆర్ తెలంగాణా ప్రభుత్వాన్ని రద్దు చేయగానే.కాంగ్రెస్ పార్టీ టీడీపీ , జేఏసీ , సీపీఐ లతో కూటమి కట్టేసింది.

 Crashes In Mahakutami In Telangana Political Parties1-TeluguStop.com

కేసీఆర్ ని ఓడించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగా వ్యుహాలని సిద్దం చేసింది.ఇదిలాఉంటే ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ఇప్పుడు కూటమిలో సీట్ల విషయంలో లొల్లి జరుగుతోందట మా పార్టీకే ఎక్కువ సీట్లు కావాలంటే మా పార్టీకి కావాలంటూ టీడీపీ తెలంగాణా సమితి కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకువస్తున్నాయని తెలుస్తోంది.

దాంతో ఏమి చేయాలో ఎలా సీట్లని సర్దుబాటు చేయాలో తెలియక అల్లాడి పోతోంది కాంగ్రెస్.

మహాకూటమి కట్టి తెరాసను గద్దె దించడం ఏమో కానీ.సీట్ల సర్దుబాటు విషయంలో ఏమి చేయాలో తెలియక సతమత మవుతోంది కాంగ్రెస్ కూటమిలో భాగంగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి.30 నుంచి 35 వరకు స్థానాలను కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాలనుకుంది.అయితే కాంగ్రెస్ ఊహించిన ఈ సీట్ల సర్దుబాటు రివర్స్ అవుతోంది.ఇష్టం లేకపోయినా అవసరాల దృష్ట్యా జట్టు కట్టిన టీడీపీ పార్టీ ఏకంగా టీడీపీ 25 నుండి 30 స్థానాలు కేటాయించాలని కోరుతోందట.

ఇదిలాఉంటే టీజేఎస్ కూడా మాకు 30 స్థానాలు ఇవ్వాల్సిందే అంటూ మొండిపట్టు పట్టిందట.అయితే ఇద్దరి కోరికలకి దిమ్మతిరిగిపోయిన కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు ఇవ్వలేమని తెల్చేసిందట టీడీపీకి 15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందట.

అయితే టీజేఎస్‌ తరఫున అభ్యర్థులు బలంగా లేకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేసే స్థానాలని టీజేఎస్ అడుగుతోందట.దాంతో

కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసిందట ఈ రెండు పార్టీలకు ఇన్ని సీట్లు ఇచ్చేస్తే వారు అడిగిన స్థానాలని ఇచ్చేస్తే మనకి మిగిలేది ఏముంటుంది అంటూ ఆందోళన వ్యక్తమ చేసిందట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యోక్క ఓటు బ్యాంక్ చీలిపోకుండా ఉండటానికి మాత్రమే మాహాకూటమి కట్టాము తప్ప ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తూ పొతే కూటమి అవసరం లేదని ఫిక్స్ అయ్యిందట కాంగ్రెస్ పార్టీ మరి మహాకూటమిలో మొదలైన ఈ సీట్ల లొల్లి సాఫీగా ముగుస్తుందో లేక టీడీపీ కాంగ్రెస్ లు ఎవరి దారి వారు చూసుకుంటారో వేచి చూడాలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube