టిక్ టాక్ కోసం అన‌వ‌స‌ర ప్ర‌యోగాలు.. చివ‌ర‌కు!

భద్రతా కారణాల రిత్యా టిక్ టాక్ యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా పలు దేశీ యాప్స్ వచ్చాయి.

 Crane Operator Tiktok Star Xiao Qiumei Death Viral, Tiktok Star Xiao Qiumei , Ti-TeluguStop.com

కాగా, టిక్ టాక్ వల్ల అనవసర ప్రయోగాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు.మనం ఇప్పుడు తెలుసుకోబేయే ఘటన కూడా ఈ కోవకు చెందినదే.

యూజ్ లెస్ థాట్ వల్ల ఓ యువతి 160 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

చైనాకు చెందిన 23 ఏళ్ల జియావో క్యుమీ టిక్ టాక్ స్టార్‌గా బాగా పాపులర్.క్రేన్ ఆపరేటర్‌గా పని చేసిన ఆమె నటించిన పలు వీడియోలకు వ్యూస్ లక్షల్లో ఉండగా, ఒక రకంగా ఆమె కొంత మందికి ఇన్‌స్పిరేషన్ అనే చెప్పొచ్చు.

పలువురిని ఆమె ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చేసింది.అయితే, అనవసర ప్రయోగం వల్ల అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది.క్రేన్ ఆపరేటర్‌గా పలు వీడియోలు రికార్డు చేయగా, వాటికి మంచి వ్యూస్ లభించాయి.డిఫరెంట్ యాంగిల్స్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ వీడియోలు చేసేది.

ఈ క్రమంలోనే మరో డిఫరెంట్ వీడియో చేయాలనుకుంది.తోటి ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత 160 అడుగుల ఎత్తులో క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో.ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోయింది.ఇక వీడియో తీసే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయింది.అలా ప్రాణం తీసేసుకుంది.కాగా, ఇదంతా లైవ్ వీడియో స్ట్రీమింగ్‌లో రికార్డు కాగా, అది చూసి నెటిజన్లు అలర్ట్ అవుతున్నారు.

అలా అనుకోకుండా టిక్ టాక్ స్టార్ లాస్ట్ వీడియో కూడా లైవ్ స్ట్రీమ్‌లో వైరల్‌ అయింది.అది చూసి నెటిజనాలు, ఆమె ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేశారు.23 ఏళ్లకే టిక్ టాక్ స్టార్ అయిన జియావో ఇలా సడెన్‌గా చనిపోయి తన కుటుంబీకులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube