నాట్స్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ..!!!

అకస్మాత్తుగా గుండె పోటు వస్తే ఏమి చేయాలి, ఎలా ప్రాణాలని కాపాడుకోవాలి, అనే విషయాలు చాలా మందికి తెలియదు.ఒక వేళ తెలిసినా ఆ కంగారులో కొందరికి ప్రక్రియలు గుర్తుకు రావు కూడా.

 Cpr Training Conducted By St Louis-TeluguStop.com

ఒకే సరి గుండెపోటు వచ్చి భాధపడే వారిని సీపీఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు.ఈ ప్రక్రియ తమ సభ్యులు ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని భావించిన నాట్స్ బాషే రమ్యం.

సేవే గమ్యం, అనే నినాదంతో ముందడుగు వేసింది.

నాట్స్ సభ్యులకి గుండెపోటు వచ్చినపుడు అవలంభించే సీపీఆర్ విధానంపై శిక్షణ ఇవ్వాలని భావించింది.

సెయింట్ లూయిస్ నాట్స్ చాప్టర్ ఇప్పుడు సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను స్థానిక తెలుగు సంఘం టీ.ఏ.ఎస్ తో కలిసి చేపట్టింది.దాదాపు 80 మంది తెలుగువారు ఈ శిక్షణకి హాజరయ్యారు.

గుండెనొప్పితో కింద పడిపోయినప్పుడు వారికి తిరిగి శ్వాస అందించే ప్రక్రియ సీపీఆర్ పై నిపుణులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ప్రమాద వశాత్తు గాయాలైన భాదితులు షాక్ అయ్యి ట్రామాలోకి వెళ్ళినప్పుడు భయాందోళనలో అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు మరలా వారిని తిరిగి యధాస్థితికి తీసుకువచ్చేందుకు ఎ విధంగా వ్యవహరించాలి అనే విషయాలపై ఈ శిక్షణలో తెలిపారు.

ఈ శిక్షణకి వచ్చిన వారికి ధృవీకరణ పత్రాలని కూడా అందచేశారు.శిక్షణకి వచ్చిన అందరికి నాట్స్ ఉచితంగా సీపీఆర్ కిట్స్ అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube