కొత్త రాజధాని వెనుక కార్పొరేట్ "హాస్తాలు"

సీమాంధ్ర రాజధాని నిర్మాణం కృష్ణ-గుంటూరు నడుమ నిర్మించడం అందరూ హర్షించ దాగిన విషయమే అయినప్పటికీ రాజకీయ నేతలు అందరూ చంద్రబాబుపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు సందిస్తూనే ఉన్నారు.మాకినేని బసవపున్నయ్య శత జయంతి సందర్భంగా ‘రాజధాని నిర్మాణం పాలన కోసమా? ప్రతిష్ఠ కోసమా?’ అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో సీ.పీ.యం పోలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ రాఘవులు మాట్లాడుతూ చంద్ర బాబు పై ఫయిర్ అయ్యారు.కొత్త రాజధాని కోసం “వారి అవసరాలే వారికి సరిగ్గా తెలియని” జపాన్, సింగపూర్ వాళ్ళ సలహాలు అడగాల్సిన అవసరం ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఇలా చెయ్యడం వల్ల ప్రజలు చాలా నష్ట పోతారు అంటూ ప్రజల మనిషిగా ఆయన చంద్ర బాబును ప్రశ్నించారు.అంతేకాకుండా ఇప్పుడు రాజధానిగా ప్రకటించబడిన తుళ్ళూరు ప్రాంతంలో భూములు అన్నీ బడా బాబుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి అని.రానున్న రోజుల్లో అక్కడ పెద్ద పెద్ద మాల్స్ కడతారు కానీ, సామాన్యుడుకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుందా అంటూ ఆయన ప్రశ్నించారు.ఏది ఏమైనా రాజధాని నిర్మాణం మాట పక్కన పెడితే పాపం చంద్రబాబు పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శల వర్షం పడుతూనే ఉంది.

 Cpm Leaders Fire On Chandrababu-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube