రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలి..!

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసిఆర్ దళితబంధు సోమవారం మొదలు పెట్టారు.

 Cpm Demands Dalit Bandhu Should Be Implement Across The State  , Cpm Jabbar, Cm-TeluguStop.com

అయితే దళితబంధు పథకాన్ని తెలంగాణా రాష్ట్రమంతా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ డిమాండ్ చేస్తున్నారు.ఆత్మకూరు మండలంలోని రేచింతల గ్రామంలో సోమవారం సీపీఎం 6వ గ్రామ శాఖా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎండీ జబ్బార్ మాట్లాడుతూ దళితబంధు పథకం హుజూరాబాద్ లో ఉప ఎన్నిక సందర్భంగా ఆ ప్రాంతానికే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని బ్రష్టు పట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు, కార్మిక కోడ్ లను వెంటనే రద్ధు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజలందరికి న్యాయం జరిగేలా పథకాలు అమలు చేయాలని అన్నారు.

రేచింతల నుండి శాగాపూర్ వంతెన నిర్మాణ పనులను కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు మండల కార్యదర్శి శ్రీహరి.కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొందరు పాల్గొన్నారు.

 దళితబంధుతో పాటుగా బీసీ బంధు పై కూడా ప్రజలు కోరుతున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube