చంద్రబాబు విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్.. !

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కరోనా వైరస్ విషయంలో మాట్లాడాడని కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంలో టీడీపీ నేతలు పలు విమర్శలు చేస్తుండగా తాజాగా ఇదే అంశం పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ చంద్రబాబు పై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 Cpi State Secretary Demands Chandrababu Case-TeluguStop.com

రాజకీయ కక్షలో భాగంగానే బాబుపై అక్రమ కేసులు బనాయించారని, ఇది ముమ్మాటికి కక్ష సాధింపేనని, దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు.ఇకపోతే ప్రధాని మోదీ మెప్పు పొందేందుకే హేమంత్ సోరెన్ ట్వీట్‌పై జగన్ స్పందించారని విమర్శించారు.

 Cpi State Secretary Demands Chandrababu Case-చంద్రబాబు విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా చంద్రబాబుపై అందిన ఫిర్యాదు పరిశీలిస్తున్నట్టు, శాస్త్రీయంగా దర్యాప్తు జరిపిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.ఇకపోతే ఒక వైపు ప్రజల ప్రాణాలు కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడుతుంటే ఈ రాజకీయ నేతల గొడవలు ఏంటో అని ప్రజలు విసుక్కుంటున్నారట.

#CPI Ramkrishna #Supports

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు