సీఎం జగన్‌కు కొత్త పేరు  

Cpi State Convenor Ramakrishna Comments On Jagan About His Name Change-ap Three Capitals,jagan And Thuglak,jagan Name Change His Name Jaglak,ramakrishna

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా తుగ్లక్‌ నిర్ణయాల మాధిరిగా ఉన్నాయంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా కూడా తుగ్లక్‌ మంచి పరిపాలన అందించాడని, కాని జగన్‌ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపించారు.

CPI State Convenor Ramakrishna Comments On Jagan About His Name Change-Ap Three Capitals Jagan And Thuglak Change Jaglak

ఇదే సమయంలో రాజధాని మార్పు విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్‌కు కొత్త పేరును పెట్టడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ.మన సీఎం తుగ్లక్‌ కాదని జగ్లక్‌ అన్నాడు.రాజధాని మార్పు విషయంపై వెనక్కు తగ్గాలని లేదంటే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను పట్టించుకోరా అంటూ ప్రశ్నించాడు.మీడియా ఛానెల్స్‌పై జులుం ప్రధర్శిస్తూ వాటి ప్రసారాలను ప్రభావితం చేసే విధంగా జగన్‌ వ్యవహరిస్తున్నాడు.

ఇది ఏమాత్రం సరైన పద్దతి కాదు.ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యం దెబ్బ తీస్తుంది.అమరావతినే రాజధానిగా కొనసాగించాల్సిందే అంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

Cpi State Convenor Ramakrishna Comments On Jagan About His Name Change-ap Three Capitals,jagan And Thuglak,jagan Name Change His Name Jaglak,ramakrishna Related....