తమిళనాడు సీఎం పై సిపిఐ అగ్రనేత నారాయణస్వామి ఫైర్..!!

కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ ఆరో తారీకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది.

 Cpi Leader Narayanaswamy Fires At Tamil Nadu Cm-TeluguStop.com

దీంతో మార్చి 12వ తారీకున నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం పళని స్వామి ఒక్కసారిగా తమిళ ప్రజలపై వరాల జల్లు హామీలు కురిపించారు.రైతుల రుణమాఫీ డ్వాక్రా మహిళల రుణాలు ఇంకా మరికొన్ని వాటిపై మాత్రమే కాక వన్నియార్ కులానికి 10.5 శాతం రిజర్వేషన్లు కూడా ఇస్తామని ప్రకటించారు.

దీంతో సిపిఐ అగ్రనేత నారాయణస్వామి పళని స్వామి వ్యవహరించిన తీరుపై ఫైర్ అయ్యారు.

 Cpi Leader Narayanaswamy Fires At Tamil Nadu Cm-తమిళనాడు సీఎం పై సిపిఐ అగ్రనేత నారాయణస్వామి ఫైర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరిగ్గా ఎన్నికల ముందు ఈవిధంగా వరాలు కురిపించడం సరైన విధానం కాదని తమిళనాడు అదేవిధంగా పుదుచ్చేరిలో రాజకీయం కోసం ద్రావిడ సంస్కృతిని నాశనం చేస్తున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.అదేవిధంగా బీజేపీ నాయకుడు తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జి కిషన్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

వారసత్వ రాజకీయాలు మంచిది కాదని వాదించే కిషన్ రెడ్డి దేశంలో ధనిక కుటుంబాలు అంబానీ, అదానీ కుటుంబాలను కేంద్రం దగ్గరుండి పోషించడం ఏంటి అంటూ నిలదీశారు.అదేవిధంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం పై కూడా మండిపడ్డారు.

#Narayana Swamy #Palani Swamy #Tamilnadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు