నాగర్జున సాగర్‌ ఎన్నికలలో ఊహించని మార్పుకు శ్రీకారం చుడుతున్న ఎర్రజెండా పార్టీలు.. ?

ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రతి గుండెల్లో నేనున్నాననే అత్మస్దైర్యాన్ని నింపిన పార్టీ ఎర్రజెండా గుర్తు.ఎక్కడ ఏ కష్టమొచ్చినా, ఎవరికి ఏ నష్టమొచ్చినా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే.

 Cpi Cpm Parties Support For Trs In Nagarjuna Sagar By Election-TeluguStop.com

కానీ ఈ ఎర్రజెండాలు కూడా మసిబారిపోతున్నాయట.ప్రజల పక్షంలో ఉండి పోరాడే పార్టీలుగా పేరున్న సీపీఐ, సీపీఎం లు ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు తమ మద్దతును ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా కొన్ని రోజుల క్రితం పార్టీ శ్రేణులతో జరిగిన ఓ సమావేశం లోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారట.

 Cpi Cpm Parties Support For Trs In Nagarjuna Sagar By Election-నాగర్జున సాగర్‌ ఎన్నికలలో ఊహించని మార్పుకు శ్రీకారం చుడుతున్న ఎర్రజెండా పార్టీలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సమయంలో కమ్యూనిస్టులుగా ఉంటూ బూర్జువా టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడమేంటని ప్రశ్నించి నోర్లను సైతం కేంద్ర, రాష్ట్ర కమిటీల నిర్ణయమని చెప్పి నోర్లు మూయించారని సమాచారం.

కానీ ఈ మద్దతు విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కుదరదంటూ చివరలో చావు పాట పాడిన నేతలు ఆ నోట, ఈ నోట విషయం బయటకు రావడంతో చివరకు కామ్రేడ్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించక తప్పలేదు.ఇక అసలే రాజకీయ పోరులో ప్రజలకు దశల వారీగా దూరమవుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఇలా టీఆర్ఎస్‌కు మద్దతునివ్వడం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తిని రగిలిస్తోందట.

#NagarjunaSagar #Cpi Cpm Parties #Trs Support #Nagarjuna Sagar #Support

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు