పవన్ కి ఓ దణ్ణం పెట్టి తప్పుకోనున్న “వామపక్షాలు”..రీజన్ ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గుంటూరు బహిరంగ సభలో చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుంటూ విమర్శలు సంధించారో అప్పటి నుంచీ పవన్ కి బ్యాండ్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.అయితే పవన్ తెలంగాణా నుంచీ బస్సు యాత్ర మొదలు పెట్టక ముందు కత్తి మహేష్ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్నాడు.

 Cpi Cpm Good Bye To Janasena Party Reason Is-TeluguStop.com

ఆ సమయంలో కత్తి చేసే వ్యాఖ్యలకి జనసేన దగ్గర కౌంటర్ ఇవ్వడానికి కూడా సమాధానాలు ఉండేవి కావు.తరువాత ఆ గొడవ రాజీతో సమసిపోయింది అయితే.

తాజాగా శ్రీ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన అడిగిన మీడియా వారితో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మరో వివాదంలోకి నేట్టేశాయి.ఆమె అలా చేయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని చెప్పడంతో శ్రీ రెడ్డి రెచ్చిపోయింది దాంతో .శ్రీ రెడ్డి మొదలు చాలా మంది పవన్ పై ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ విషయంలో పవన్ అభిమానులు కూడా రెచ్చి పోతున్నారు.

అయితే పరిస్థితి మరింత చేజారిపోయేలా ఉండటంతో జనసేన స్పందించింది.పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం రాజకీయ కుట్రగా అభివర్ణించింది.

ఈ వ్యాఖ్యల వెనుక టిడిపి పార్టీ ఉందేమో అనే అనుమానాలు పవన్ అభిమానులు కూడా వ్యక్తం చేశారు.

అయితే.

పవన్ కళ్యాణ్ కి తోడుగా ఉంటామని.రాజకీయాల్లో జనసేన కి సపోర్ట్ చేస్తామని గత కొంతకాలంగా రాసుకు పూసుకు తిరుగుతున్న ఏపీ వామపక్షాలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి.

అయితే శ్రీ రెడ్డి ఉద్యమాన్ని ముందుకు నడిపించే వామపక్ష నేతలతో సన్నిహితంగా ఉండే మహిళా ఉద్యమ నేత సంధ్య లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నా సరే వామపక్ష నేతలు మాత్రం ఎంతో సైలెంట్ గా ఉండిపోయారు…ఈ సైలెన్స్ వెనుక కారణం పవన్ పై వారికి కలుగుతున్న సందేహాలే అని అంటున్నారు విశ్లేషకులు.ఎందుకంటే

గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ అర్థరాత్రి తన సొంత కారులో వచ్చి అమ్మాయిలని దింపుతాడు.త్రివిక్రమ్ ఎన్నో సెటిల్మెంటులు కూడా చేశారు అని చేసిన ఆరోపణలకి తాజాగా పవన్ కళ్యాణ్ బెంగాలి అమ్మాయిలు మసాజ్ లు చేయించుకుంటాడు అంటూ వచ్చిన ఆరోపణలు ఈ ఆరోపణలని ఖండించకుండా జనసేన పార్టీ నాయకులు ఉండటం వామపక్ష నేతలకి మరింతగా పవన్ పై అనుమానాలని కలిగిస్తోంది అంటున్నారు.

అందుకే పవన్ తో ఇప్పటి వరకూ ఉన్న భందాన్ని ఇక కొనసాగనివ్వ కూడదు అంటూ పార్టీలో సీనియర్స్ అంటున్నారట.త్వరలోనే జనసేన తో కటీఫ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాలని అనుకుంటున్నారు అని టాక్ కూడా వినిపిస్తోంది.

ఇదే గనుకా జరిగితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వాం ఖాయం అంటున్నారు విశ్లేషకులు మరి పవన్ వామపక్షాలు చేజారి పోకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకుంటాడో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube