వైరల్‌ : ఫుట్‌బాల్‌ ఆడిన ఆవు నమ్మకుంటే వీడియో చూడండి

కొన్ని సార్లు జంతువులు తమ వద్దకు ఏదైనా వస్తువు వస్తే దాన్ని ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించవు.ఆ వస్తువును తమతో పాటే ఉంచుకోవాలని భావిస్తాయి.

 Cowplays Football With Groupof Boys-TeluguStop.com

ఆ వస్తువు గురించి తెలియకున్నా కూడా ఆ జంతువులు మాత్రం మనుషులు ఎంగా బతిమిలాడినా గొడవ పడినా కూడా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తాయి.ఎక్కువగా కోతులు కొన్ని వస్తువులను తీసుకు వెళ్తాయి.

ఆ వస్తువులు వాటికి ఏం అవసరం లేకున్నా కూడా తమతోనే ఉంచుకుంటాయి.ఆ వస్తువులను ఇవ్వమని కోతులు ఎంతగా రిక్వెస్ట్‌ చేసినా కూడా ఇష్టపడవు.

తాజాగా మహారాష్ట్రలో ఒక ఆవు ఫుట్‌ బాల్‌ను దగ్గర పెట్టుకుని కుర్రాళ్లకు ఇవ్వకుండా వారితో ఒక ఆట ఆడుకుంది.రాష్ట్రంలోని ఒక మైదానంలో కుర్రాళ్లు ఫుట్‌ బాల్‌ ఆడుతున్నారు.

అదే సమయంలో అక్కడ లైట్‌ గా వర్షం రావడంతో మైదానం చిత్తడిగా అయ్యింది.రోడ్డు పక్కనే ఉన్న ఓపెన్‌ మైదానంలో కుర్రాళ్లు ఫుట్‌ బాల్‌ ఆడుతుంటే అదే సమయంలో ఒక ఆవు అక్కడకు వచ్చింది.

వారు ఆడుతుంటే కొద్ది సేపు చూసింది.ఆ సమయంలోనే బాల్‌ ఆ ఆవు వద్దకు వెళ్లింది.

దాంతో ఆవు తన వద్ద బాల్‌ను ఉంచేసుకుంది.

వైరల్‌ : ఫుట్‌బాల్‌ ఆడిన ఆవు న�

కాళ్ల మద్య బాల్‌ను ఉంచుకుని కుర్రాళ్లను దగ్గరకు రానివ్వడం లేదు.ఎవరైనా బాల్‌ కోసం వెళ్తే వారిని పొడిచేందుకు ఉరికి వచ్చింది.అలా చాలా సేపు ఆ కుర్రాళ్లకు బాల్‌ దొరకకుండా చేసింది.

ఏదో విధంగా ఆవు దృష్టి మరల్చి బాల్‌ను ఒక కుర్రాడు అక్కడ నుండి తన్నేశాడు.దాంతో ఆవు ఆ బాల్‌ వెంట పరుగులు తీసింది.

బాలు పాస్‌ చేస్తూ ఆవుకు దొరకకుండా కుర్రాళ్లు కొద్ది సమయం ఆడుకున్నారు.బాల్‌ ఎటు పాస్‌ చేస్తే అటుగా ఆవు పరుగు పెట్టింది.

చివరకు బంతిని మళ్లీ దక్కించుకుంది.బంతితో ఆవు ప్రవర్తించిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది.

వైరల్‌ : ఫుట్‌బాల్‌ ఆడిన ఆవు న�

ఒక ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ మాదిరిగా బాల్‌ను కాలుతో ఆడిస్తూ వచ్చింది.ఆవుతో ఆ కుర్రాళ్లు ఆడుకున్న తీరుపై విమర్శలు వ్యక్తం అవుతుండగా మరి కొందరు ఆ ఆవు గత జన్మలో ఏమైనా ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ అయ్యి ఉంటుందా అంటూ జోకులు పూస్తున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube