సెల‌బ్రిటీగా మారిపోయిన ఆవు.. చూసేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం!

చాలా మంది సెలబ్రెటీలను మనం చూసి ఉంటాం.వారు ఆ సెలబ్రెటీ పొజిషన్ కు రావడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తారు.

 Cow Who Has Become A Celebrity People Who Are Going To See It!, Cow, Low Hight,-TeluguStop.com

ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతారు.కానీ ఇవేవీ లేకుండానే బంగ్లాదేశ్ లో ఓ ఆవు రాత్రికి రాత్రే సెలబ్రెటీలా మారిపోయింది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గర్లో ఉన్న చారిగ్రామ్ అనే ఊరిలో ఈ ఆవు ఉంది.ఇంతలా సెలబ్రెటీలా మారిపోవడానికి ఆ ఆవులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని ఆలోచిస్తున్నారా.

ఆ ఆవు రూపమే దానిని సెలబ్రెటీలా చేసింది.ఆ ఆవు ఎత్తు కేవలం 51 సెంటీమీటర్లు మాత్రమేనట.

దాదాపు 2 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ ఇది 51 సెంటీమీటర్లు మాత్రమే పెరిగిందట.

ఇప్పుడు ఎత్తే ఆ ఆవు సెలబ్రెటీలా మారిపోయేందుకు కారణమైంది.

ఇలా ఎత్తు తక్కవగా ఉన్న ఈ ఆవును చూసేందుకు జనం ఎగబడుతున్నారు.మరో విశేషమేంటంటే… ఈ మరుగుజ్జు ఆవుకు రాణి అనే పేరు కూడా ఉంది.

ఇంతవరకు ప్రపంచంలో కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు అతి పొట్టిదిగా రికార్డుల్లోకెక్కింది.కానీ ఇప్పుడు రాణి ఎత్తను చూస్తే… అతి చిన్న ఆవు కన్నా 10 సెంటీమీటర్లు తక్కువగా ఉండడం విశేషం.

కేవలం 51 సెంటీమీటర్లు మాత్రమే ఉన్న ఈ ఆవు 26 కిలోల బరువే ఉందట.

Telugu Bangladesh, Dhaka, Hasan, Rani-Latest News - Telugu

హసన్ అనే రైతు ఇంట్లో ఈ ఆవు ఉంది.ఇలా కుప్పలు తెప్పలుగా జనాలు రావడంపై స్పందించిన హసన్ మాట్లాడుతూ… లాక్‌డౌన్‌ను కూడా లెక్కచేయకుండా ఈ ఆవును చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారని తెలిపాడు.అంతే కాకుండా వచ్చిన వారిలో చాలా మంది రాణితో ఫొటోలు కూడా దిగుతున్నారట.

గిన్నిస్ రికార్డు కోసం నిర్వాహకులను సంప్రదించగా… వారు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారని పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube