బీజేపీ, కాంగ్రెస్‌ను కలిపిన ఒక రైతు.. అతడి ప్రయత్నంను నవ్వుతూ అభినందిస్తున్న సోషల్‌ మీడియా జనాలు

చిన్న పిల్లలకు కూడా కాంగ్రెస్‌ మరియు బీజేపీలు రాజకీయ బద్ద శత్రువులు అని, ఈ రెండు పార్టీలు కూడా ఎప్పుడు కలిసే ప్రసక్తే లేదు.జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీల్లో ఈ రెండు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

 Cow Gives Birth To Twins Owner Names Them Bjp And Congress-TeluguStop.com

కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే పార్టీలు అయినా బీజేపీ లేదా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ రెండు పార్టీలు ఎంత బద్ద శత్రువులో ఒక సారి ఏవైనా ఎన్నికలు వస్తే అప్పుడు తెలుస్తుంది.

రెండు పార్టీలు కూడా ఒకదానితో ఒకటి ఎంతగా గొడవ పడతాయో అప్పుడు తెలుస్తుంది.

ఇంతటి బద్ద శత్రు పార్టీలు అయిన కాంగ్రెస్‌ మరియు బీజేపీలను మద్యప్రదేశ్‌కు చెందిన ఒక రైతు కలిపే ప్రయత్నం చేశాడు.రాష్ట్రానికి చెందిన ధన్‌సింగ్‌ అనే రైతుకు ఒక ఆవు ఉంది.ఆ ఆవు ఇటీవల రెండు కవల దూడలకు జన్మనిచ్చింది.

ఆ రెండు దూడలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి.ఇక తన ఆవులకు మరియు పెంపుడు జంతువులకు పేర్లు పెట్టుకునే ధన్‌సింగ్‌కు ఒక ఆలోచన వచ్చింది.

ఈ రెండు కవల పిల్లలకు కాంగ్రెస్‌ మరియు బీజేపీ అని పేరు పెడితే బాగుంటుంది కదా అనుకున్నాడు.అనుకున్నదే తడువుగా వెంటనే ఆ రెండు పేర్లు తన కవల దూడలకు పెట్టేశాడు.

కవల దూడలకు కాంగ్రెస్‌, బీజేపీ అంటూ పేరు పెట్టడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.ఈ విషయం మొదట ఆ ఊర్లో తెగ ప్రచారం జరిగింది.ఆ తర్వాత మెల్ల మెల్లగా సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చింది.సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం తెలిసి పోయింది.

బద్ద శత్రువులైన ఆ రెండు పార్టీల పేర్లను తన దూడకు పెట్టే ఆలోచన చేయడంతో ధన్‌సింగ్‌ ఇప్పుడు స్టార్‌ సెలబ్రెటీ అయ్యాడు.ఆయన దూడలను ఫొటోలు తీసుకోవడంతో పాటు ఆయన్ను కూడా తెగ మీడియా వారు పబ్లిసిటీ చేస్తున్నారు.

మొత్తానికి తనకొచ్చిన విభిన్నమైన ఆలోచనతో దూడలకు కాంగ్రెస్‌ బీజేపీ అంటూ పేర్లు పెట్టి సోషల్‌ మీడియాలో జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.ఎప్పుడు కలవని కాంగ్రెస్‌ మరియు బీజేపీలను ఇలా అయినా కలిపి చూడాలనే ఉద్దేశ్యంతో తాను ఇలా చేశాను అంటూ ఆ రైతు చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube