అమెరికాలో ఆవుపిడకల డిమాండ్.. రేటు ఎంతో తెలుసా?

గతంలో ఆన్‌లైన్‌లో ఆవు పిడకల అమ్మకం గురించి మనం చూశాం.అప్పట్లో ఆ వ్యవహారం చాలా వైరల్‌గా మారిన విషయం కూడా తెలిసిందే.

 Cow Dung Cakes Becomes Hot Topic In Usa-TeluguStop.com

ఇప్పుడు మరోసారి ఆవు పిడకల అమ్మకం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.అయితే ఇదంతా మనదగ్గర కాదులెండీ.

అమెరికా దేశంలోనూ ఆవు పిడకల అమ్మకాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయ్యింది.

అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ షాపులో ఆవు పిడకలు దర్శనమిచ్చాయి.పది పిడకలు ఉన్న ప్యాకెట్ ధర ఏకంగా రూ.214 గా ఉండటంతో ఆ ప్యాకెట్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్యాకెట్‌పై అది తినే పదార్ధం కాదని.భారత్‌కు చెందిన ఉత్పత్తిగా పేర్కొన్నారు.ఆవు పిడకల ప్యాకెట్‌ను ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో బంధించి తన బంధువుకు పంపాడు.దీంతో ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో దుమ్ములేపింది.

ఏదేమైనా ఆవు ఉత్పత్తులే కాకుండా ఆవు పేడ ద్వారా లభించే పిడకలు కూడా ఇంత పాపులారిటీని సంపాదించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని పలువురు అంటున్నారు.మరి ఈ ఆవు పిడకల వ్యాపారం అమెరికాలో ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube