అమెరికాలో ఆవుపిడకల డిమాండ్.. రేటు ఎంతో తెలుసా?  

Cow Dung Cakes Becomes Hot Topic In Usa-cow Dung Cakes,flipkart, Shopping,usa

గతంలో ఆన్‌లైన్‌లో ఆవు పిడకల అమ్మకం గురించి మనం చూశాం.అప్పట్లో ఆ వ్యవహారం చాలా వైరల్‌గా మారిన విషయం కూడా తెలిసిందే.ఇప్పుడు మరోసారి ఆవు పిడకల అమ్మకం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.అయితే ఇదంతా మనదగ్గర కాదులెండీ.

Cow Dung Cakes Becomes Hot Topic In Usa-cow Dung Cakes,flipkart, Shopping,usa Telugu Viral News Cow Dung Cakes Becomes Hot Topic In Usa-cow Flipkart Shopping Usa-Cow Dung Cakes Becomes Hot Topic In USA-Cow Flipkart Online Shopping Usa

అమెరికా దేశంలోనూ ఆవు పిడకల అమ్మకాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయ్యింది.అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ షాపులో ఆవు పిడకలు దర్శనమిచ్చాయి.పది పిడకలు ఉన్న ప్యాకెట్ ధర ఏకంగా రూ.214 గా ఉండటంతో ఆ ప్యాకెట్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్యాకెట్‌పై అది తినే పదార్ధం కాదని.

భారత్‌కు చెందిన ఉత్పత్తిగా పేర్కొన్నారు.ఆవు పిడకల ప్యాకెట్‌ను ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో బంధించి తన బంధువుకు పంపాడు.దీంతో ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో దుమ్ములేపింది.ఏదేమైనా ఆవు ఉత్పత్తులే కాకుండా ఆవు పేడ ద్వారా లభించే పిడకలు కూడా ఇంత పాపులారిటీని సంపాదించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని పలువురు అంటున్నారు.

మరి ఈ ఆవు పిడకల వ్యాపారం అమెరికాలో ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో చూడాలి.