ఆవు పేడతో స్నానం చేస్తు వింత ప్రచారం చేస్తున్న జనం..!

ఏంటో ఈ మీడియా.సోషల్ మీడియా.

 Cow Dung Bath Cures Coronavirus Was A Fake News-TeluguStop.com

అన్ని వైరస్ ల కంటే కొంచం డేంజర్ వైరస్ ఇది.కానీ ఈ కరొనపై ప్రచారం ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా చేస్తున్నారు.ఒకరు కరోనా వైరస్ సోకింది అంటే మరణించడం గ్యారెంటీ అంటే మరొకరు స్పందిస్తూ.కరోనానే కాదు ఏ వైరస్ మిమ్మల్ని ఎం చెయ్యలేదు.మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అంటారు.

ఇలా ప్రచారం జరగడం పక్కన పెడితే.

చైనాలో పుట్టిన ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.ఇది నిజం.

ఈ కరోనా వైరస్ కారణంగా చైనాలో 3వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.కొన్ని వేల మంది కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.ప్రస్తుతం కరోనా వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యింది.30మంది కరోనా బారిన పడ్డారు.

ఇకపోతే.ఈ కరోనా వైరస్ గురించి మీడియాలో ప్రచారం దారుణంగా జరుగుతుంది.ఆ ప్రచారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు అతి దారుణంగా జోకులు వేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆవు పేడలో స్నానం చేస్తే కరోనా వైరస్ దరిచేరదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇది శాస్త్రీయంగా నిరూపించలేదు.ఇప్పటి వరకు ఈ వైరస్ పై ఎలాంటి పరిశోధనలు జరగలేదు.అయితే, ప్రజలు భయంతో అది నిజమేనని నమ్మేస్తున్నారు.ఈ నేపథ్యంలో కర్నాటకలో కొందరు వ్యక్తులు ఆవు పేడతో నిండిన తొట్టెలో స్నానం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆ ప్రచారం మరింత వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి.ఆవు పేడ సర్వ రోగ నివారణి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని మాత్రమే తెలిపాడు.వీడియోలో ఎక్కడా ఆవు పేడ కరోనా వైరస్‌ను నివారిస్తుందనే సంగతి చెప్పలేదు.కాబట్టి కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మకండి.

పరిశుభ్రంగా.బయట తక్కువ తిరగడం వంటివి చెయ్యండి.

ఆరోగ్యంగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube