వైరల్: పిడకల పై అమెజాన్ లో నానా రచ్చ..!

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బయట ప్రపంచముతో సంబంధం అనేది లేకుండా మారిపోయింది మనిషి జీవితం.తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఇలా ప్రతిదాన్ని ఒక్క ఫోన్ ఉపయోగించి ఇంట్లో ఉండి తెప్పించుకుంటున్నాము.

 Cow Dug Cake-amazon-smart Phone - Flipkart- Review-social Media-use In Pray Of G-TeluguStop.com

ఆన్ లైన్ షాపింగ్స్ వచ్చాక చాలామంది బయట షాపింగ్ చేయడం మానేశారు.ఎక్కువశాతం మంది అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్ వంటి వాటిలో షాపింగ్స్ షురూ చేస్తున్నారు.

ప్రతిదీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది.ఏది కావాలన్నా సరే ఒక్క క్లిక్‌తో కావాల్సిన వస్తువులు మనకి ఎటువంటి శ్రమ అనేది లేకుండా ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి.

అయితే ఆన్ లైన్ లో ఏదన్నా వస్తువు కొనాలంటే ముందుగా చాలమంది వాటికి సంబంధిచిన రివ్యూస్, కామెంట్స్ చూసి కొంటారు.అంటే ఆ వస్తువు బాగుందా లేదా అనే నిర్దారణకి వచ్చాకే ఆర్డర్ ఇస్తూ ఉంటారు.

ఐతే ఇప్పుడు అలా ఒక వ్యక్తి అమెజాన్ లో షాపింగ్ చేసి అతను కొన్న ఐటమ్ గురించి రివ్యూ రాసాడు.ఇప్పుడు ఆ రివ్యహాట్ టాపిక్ గా మారి వైరల్ అయింది.

అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఏమి కొన్నాడు? ఆ రివ్యూలో ఏమి రాశాడో తెలుసుకోవాలని ఉందా ? అయితే పూర్తి విషయం మీరు తెలుసుకోవాల్సిందే

ఇంతకీ ఆ వ్యక్తి అమెజాన్ లో కొన్నవి ఏంటంటే ఆవు పేడతో చేసిన పిడకలు ఆ పిడకలను తిని వాటి రుచి ఎలా ఉంది అనేది రివ్యూ రూపంలో రాసాడు.పిడకలు తినడం ఏంటని షాక్ అవుతున్నారా ? వివరాలలోకి వెళితే ఓ వ్యక్తి అమెజాన్‌లో పిడకలు కొని టేస్ట్ చేసాడట.రుచి దరిద్రంగా ఉందని ఇలా రివ్యూ రాసాడు.నేను ఆ పిడక తిన్నప్పుడు రుచి ఏ మాత్రమూ బాగాలేదు.గడ్డి తింటున్నట్లుగా బురద తింటున్నట్లుగా అనిపించింది.నాకు విరేచనాలు అయ్యాయి.

పిడకలు తయారుచేసేటప్పుడు శుభ్రత పాటించండి.రుచి అదిరిపోవాలి అని పేర్కొన్నాడు.

అయితే ఆ వ్యక్తి రాసిన ఆ రివ్యూను చూసిన డాక్టర్ సంజయ్ అరోరా అనే వ్యక్తి దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టాడు.ఇది మన ఇండియాఐ లవ్ మన ఇండియా అని ట్వీట్ చేశాడు.

సాధారణంగా ఆవు పిడకలను పూజలు, హోమాలు, ఇతర భక్తి ప్రదమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు.అంతే తప్ప వాటిని ఎవరు కూడా తినరు.

అమెజాన్ కూడా దాని గురించి స్పష్టంగా పేర్కొంది.హోమాలు, పూజల్లో వాడేందుకు ఇది 100% నాణ్యమైనది.భారతదేశ ఆవు పేడని సేకరించి చేతితో తయారు చేసినవి.పూర్తిగా ఎండబెట్టరు.పిడకలను మండిస్తే వాతావరణం శుద్ధి అవుతుంది.క్రిమి కీటకాలు చనిపోతాయి అని డిస్క్రిప్షన్‌ లో అమెజాన్ పేర్కొంది.

అంతేకాని పిడకలను తినమని ఎక్కడ కూడా రాయలేదు.కాకపోతే ఆ వ్యక్తి ఎవరోగాని ఏకంగా పిడకలు తిన్నాను.

రుచి బాలేదు, ఇంకా టెస్ట్ గా తయారుచేయండి అని రాసాడు.అంతేగాని ఆ వ్యక్తి నిజంగానే పిడకలు తిన్నాడా ? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.ఎదో కొన్నాడు.ఒక కామెంట్ పెట్టాడు అంతే.అతను పబ్లిసిటీ కోసమే రివ్యూ రాశాడా ? అన్న ప్రశ్న కూడా కొందరిలో ఉంది.రివ్యూ కన్నా అతను పిడకలు తింటున్న వీడియో పోస్ట్ చేస్తే బాగుండేది కదా ఏది ఏమయినా గాని ఇప్పుడు ఈ స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube