కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ 66 రోజుల్లో అందుబాటులోకి రావడం సాధ్యమేనా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది.ఇప్పటికే కొన్ని ఫార్మాకంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశాయి.

 Covishield Vaccine Gets Approval For Clinical Trials,covishield Vaccine , Corona-TeluguStop.com

భారత్ లో కొన్ని ఫార్మా కంపెనీల వ్యాక్సిన్లతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం భారత్ కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే 100 కోట్ల డోసుల టీకాలను తయారు చేయడానికి సీరమ్ ఇనిస్టిట్యూట్ సిద్ధమవుతుందని సీఈఓ అదార్ పూనావాలా పేర్కొన్నాడు.కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఖచ్చితంగా 66 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని సమాచారం తెలుస్తోంది.

ఈ టీకాలలో భారతీయులకు 68 కోట్ల డోసుల టీకాలను అందించనున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ప్రస్తుతం నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ ని చూస్తుంటే కరోనాను పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చనే చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఇప్పటికే కోవిషీల్డ్ కు సంబంధించి రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశారు.పూణేలోకి ఓ ఆస్పత్రిలో ఇప్పటికే ఏడుగురికి టీకా అందించారు.

ఈ టీకా అందుకున్న వారిలో ఓ గైనకాలజిస్ట్ కూడా ఉన్నారని సమాచారం.దేశంలో 17 కోవిడ్ కేంద్రాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ టీకాలను 1600 మందికి అందిస్తారు.

ఇప్పటికే రెండోదశ క్లినికల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.టీకా తొలి డోసును అందుకున్న వారికి 29 రోజుల తర్వాత రెండో దఫా టీకా ఇవ్వనున్నారు.

ఇంకో 58 రోజుల్లో ప్రయోగాన్ని ముగించుకుని 15 రోజుల్లో ప్రయోగ సమాచారాన్ని క్రోడీకరించనున్నారు.

Telugu Clinical Trails, Coronavirus, Covid, Gynecologist, Harsha Vardhan, Vaccin

ఇలా మొత్తం సుమారు ఓ 66 రోజుల్లో టీకాలు అందుబాటులోకి రానున్నాయి.ప్రయోగాల సమయంలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ పాటించాల్సిన పద్ధతులు కొన్నింటినీ తగ్గించడం, పరీక్షలను వేగవంతం చేయడం జరుగుంది.ప్రయోగాలు ముగిశాక భారీ స్థాయిలో టీకా వాణిజ్య ఉత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు లైసెన్స్ జారీ చేసింది.

ఈ మేరకు టీకా తొందర్లోనే అందుబాటులోకి రానుందని భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube