అద్భుతం చేసిన టీకా.. ఏండ్లుగా చ‌చ్చుబ‌డిపోయిన వ్య‌క్తి శ‌రీరంలో క‌ద‌లిక‌లు

క‌రోనా భ‌యం ఇప్పుడు ప్ర‌పంచాన్ని ఎంత‌లా భ‌య‌పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అది చేరని ప్రాంతం లేదు.

 Covishield Vaccine Makes Paralysis Person Recovered In Jharkhand Bokaro Details,-TeluguStop.com

దాని భ‌యంతో వ‌ణ‌క‌ని దేశం లేదు.క‌నిపించ‌ని ఈ శ‌త్రువు దాదాపు రెండేండ్లుగా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.

కాగా దీన్ని అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్లు తీసుకు వ‌చ్చారు.ఇక మ‌న దేశంలో కూడా పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సాగిస్తున్నారు.

కాగా ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అయిన్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక విచిత్ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతున్నాయి.

కాగా మొన్న‌టికి మొన్న ఓ ముంబై వ్య‌క్తి శ‌రీరం మొత్తం అయ‌స్కాంతంలా మార‌డం కూడా మ‌నం చూశాం.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి విచిత్ర‌మైన ఘ‌ట‌న ఒక‌టి టీకా ద్వారా చోటుచేసుకుంది.

కాగా ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని అత్యంత విచిత్ర‌మైన ఘ‌ట‌న‌.టీకా వేయ‌గానే పక్షవాతంతో బాద‌ప‌డుతున్న వ్య‌క్తి కూడా కదలికలు చూపించ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

బొకారో జిల్లాలో ఉండే దులార్‌చంద్ ఐదేళ్ల కింద‌ట రోడ్డు ప్రమాదంలో గాయ‌ప‌డి ప‌క్ష వాతానికి గుర‌య్యాడు.అప్ప‌టి నుంచి అత‌ను ఎలాంటి క‌ద‌లిక లేకుండా చ‌చ్చుబ‌డి పోయి ఉన్నాడు.

Telugu Covid Vaccine, Corona, Dumb Person, Recovered-Latest News - Telugu

అయితే క‌రోనా కోర‌లు చాస్తున్న నేప‌థ్యంలో అత‌నికి కూడా వ్యాక్సిన్ వేయించారు కుటుంబ స‌భ్యులు.కొవీసీల్డ్ వ్యాక్సిన్ వేయ‌డంతో అద్భుతం జ‌రిగింది.ఇలా వ్యాక్సిన్ వేసిన తెల్లారి నుంచే అత‌ను మాట్లాడ‌టం స్టార్ట్ చేశాడు.పైగా శరీరంలో కూడా కదలికలు ఉన్నాయి.ఐదేళ్లుగా శ‌వంలా ఎలాంటి క‌ద‌లిక‌లు, మాట‌లు లేకుండా ఉన్న వ్య‌క్తి.టీకా వేయ‌డంతో ఇలా మాట్లాడ‌టం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

దీంతో ఆ కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి.కాగా ఇందుకు సంబంధిచిన వార్త ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube