ఇంటికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన డాక్టర్… సోషల్ మీడియాలో వైరల్  

Covidi 19 Corona Virus Lock Down Doctors Sudheer Dehariya Sivaraj Singh Chowhan - Telugu Corona Virus, Covid-19 Doctor Has Tea With Family From Social Distance Wins, Covidi-19, Lock Down

కరోనా వైరస్ పోరాటంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది కీలక భూమిక పోషిస్తున్నారు.ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా వీరంతా విధి నిర్వహణలో ఉన్నారు.

 Covidi 19 Corona Virus Lock Down Doctors Sudheer Dehariya Sivaraj Singh Chowhan

కనీసం కుటుంబంతో కూడా గడపలేని పరిస్థితిలో ఉన్నారు.అయిన కూడా వారు ఎలాంటి బాధ లేకుండా కరోనా నియంత్రణలో సేవలు చేస్తున్నారు.

ఇక డాక్టర్లు అయితే తమకి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసిన కూడా పేషెంట్ లకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.దీంతో వీళ్ళు వెళ్లి కుటుంబ సభ్యులని, పిల్లలని కూడా కనీసం దగ్గరకి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

ఇంటికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన డాక్టర్… సోషల్ మీడియాలో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఒక దృశ్యం అందిరినీ ఆకట్టుకుంటోంది.

భోపాల్ కు చెందిన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ దేహరియా చాలా రోజులుగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు.డాక్టర్ సుధీర్ ఐదు రోజుల డ్యూటీ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి, తన కుటుంబ సభ్యులతో పాటు టీ తాగారు.

డాక్టర్ సుధీర్ దేహరియా ఇంటి బయటనే కూర్చుని టీ తాగారు.బయటి నుండే తిరిగి ఆసుపత్రికి వెళ్లారు.డాక్టర్లు విధి నిర్వహణలో ఇప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నారో ఈ ఫోటో ఒక సంకేతంగా ఉంది.ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా మందిని కదిలించింది.

దీంతో నెటిజన్లు వైద్యుల సేవలని కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు