యూఎస్: డెల్టా వేరియంట్ తీవ్రత.. చిన్నారులకు వ్యాక్సిన్, నవంబర్ నాటికి అందుబాటులోకి

తొలి విడతలో అగ్రరాజ్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి అక్కడ బుసలు కొడుతోంది.డెల్టా వేరియంట్ కారణంగా అమెరికాలో ప్రస్తుతం భారీగా కేసులు పెరుగుతున్నాయి.ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 4 కోట్ల 18 లక్షల మంది కోవిడ్ బారినపడగా.6 లక్షల 77 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే రానున్న కాలంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది.ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

 Covid Vaccines For Children Below 12 In Us May Be Available By November, Covid V-TeluguStop.com

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.

5 నుంచి 11 ఏళ్ల వయసు గల చిన్నారులకు కోవిడ్ 19 టీకాలు అక్టోబర్ చివరి నాటికి అందుబాటులో వుంటాయని తెలుస్తోంది.ఇది తల్లిదండ్రులకు ఊరట కలిగించే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చిన్న పిల్లల టీకాకు సంబంధించి త్వరగా ఆమోదం పొందేందుకు గాను క్లినికల్ డేటాను త్వరితగతిన సమీక్షించాల్సిన అవసరం వుందని ఫైజర్ బోర్డ్ మెంబర్, అమెరికా మాజీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమీషనర్ డాక్టర్ స్కాట్ గాట్లీబ్ వ్యాఖ్యానించారు.డేటా విషయంలో ఫైజర్‌పై తనకు నమ్మకం వుందని గాట్లీబ్ చెప్పారు.

టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో తాత్కాలిక పీడియాట్రిషియన్ ఇన్ చీఫ్ డాక్టర్ జేమ్స్ వెర్సలోవిక్ మాట్లాడుతూ.అక్టోబర్ నాటికి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఆమోదం పొందే అవకాశాలకు సంబంధించి గాట్లీబ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.

ఈ పరీక్షలను ముందుకు తీసుకెళ్లడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని జేమ్స్ తెలిపారు.అత్యంత వేగంగా వ్యాప్తి చెందే డెల్లా డేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు సైతం ఆసుపత్రుల్లో చేరుతున్నారని.

ఇప్పటికే తన సహచరుల పిల్లలు సైతం కోవిడ్ బారినపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తాము ఇప్పటికే తీవ్ర పరిస్థితుల మధ్య వున్నామని.

రాబోయే రోజుల్లో ఇది మరింత క్లిష్టంగా మారే అవకాశాలు వున్నాయని జేమ్స్ అభిప్రాయపడ్డారు.

Telugu Corona, Covid, Covid Childrens, Delta, Modernna, Pfizer-Telugu NRI

కాగా ఫైజర్, మోడెర్నా రెండూ పిల్లల్లో కోవిడ్ టీకాకు సంబంధించి భద్రత, మోతాదు, ప్రభావం వంటి విషయాలపై డేటాను సేకరిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది.పెద్దలతో పోలిస్తే కోవిడ్ బారినపడిన పిల్లలకు తేలికపాటి లక్షణాలు వుంటాయని, మరికొందరు పిల్లలలో ఎలాంటి లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు.అంతేకాకుండా చిన్నారులు ఆసుపత్రిలో చేరడం, మరణించే శాతం కూడా చాలా తక్కువని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube