ట్రంప్ పై వ్యాక్సిన్ ప్రయోగం..బిగ్ సక్సెస్ అంటున్న వైద్యులు..!!!

అమెరికాలో కరోన ప్రభావంతో లక్షలాది మంది మృతి చెందారు, మరోంతో మంది కరోనా తో ఇప్పటికి పోరాటం చేస్తూనే ఉన్నారు.కంపెనీలు మూతపడ్డాయి, నిరుద్యోగం తాండవం చేస్తోంది, ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు.

 Trump Given Regeneron’s Experimental Drug, Donald Trump, Covid-19 Vaccine, Whi-TeluguStop.com

గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్భర పరిస్థితి అమెరికా ప్రజలు ఎదుర్కోలేదు.అందుకు ప్రధాన కారణం కేవలం ట్రంప్, ఆయన నిర్ణయాలు, ఆయన అలసత్వమే అంటూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ధ్వజమెత్తింది.

దాంతో అమెరికా ప్రజలు కూడా ట్రంప్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ట్రంప్ ని మరో సారి అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దని, కరోనా ని నిలువరించడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారని అసలు లోగుట్టు బయట పెట్టుకుంది…ఈ క్రమంలోనే

అధ్యక్షుడిగా ట్రంప్ తనపై పడిన ఈ ముద్రను చెరిపెసుకునేందుకు కరోనా మందును కనుగొనాలని నిపుణులులకు సూచనలు చేయడంతో పాటు ఎన్నికల్లోగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఈ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ జరగలేదని, ఎలా పడితే అలా ప్రజల్లోకి వదిలేస్తారా అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టింది.పలు రాష్టాలకు ఈ వ్యాక్సిన్ పంపాలని సిద్దంగా ఉన్న ట్రంప్ కి క్లినికల్ ట్రయల్స్అనే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు అడ్డుగా నిలిచాయి.

ఇలాంటి సమయంలో

ట్రంప్ కి కరోనా రావడంతో సైనిక ఆసుపత్రిలో తన వ్యక్తిగత వైద్యులతో చికిత్స పొందుతున్న ట్రంప్ చాలా తక్కువ వ్యవధిలోనే కోలుకుని హుషారుగా కనిపించడమే కాకుండా వైట్ హౌస్ చేరుకొని ఎంతో ఆరోగ్యంగా కనపడుతున్నారు.ఇంత తక్కువ వ్యవధిలోనే ట్రంప్ కోలుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇంతకీ అసలు కారణంగా ఏమిటంటే.ట్రంప్ అమెరికా వ్యాప్తంగా కరోనా సోకినా రోగులకోసం సిద్దం చేస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందొ అదే వ్యాక్సిన్ ట్రంప్ కి వాడినట్టుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

ట్రంప్ కు తొలి సారి ఇచ్చిన డోస్ తో ఆరోగ్యం ఎంతో మెరుగు పడిందని , రెండవ సారి ఇచ్చిన డోస్ తో కిడ్నీ, గుండె, కాలేయం వంటి భాగాలు అన్నీ ఎంతో చురుకుగా పనిచేస్తున్నాయని వైద్యులు ప్రకటించారు.కేవలం అతి తక్కువ వ్యవధిలోనే ట్రంప్ ఈ వ్యాక్సిన్ ద్వారా కోలుకోవడంతో ట్రంప్ సైతం సంతోషం వ్యక్తం చేశారట.

ఇక అమెరికా ప్రజలకు ఈ వ్యాక్సిన్ నిరభ్యంతరంగా అందించవచ్చునని ఈ వ్యాక్సిన్ బిగ్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు వైద్య నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube