ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ టెస్ట్ లు...ఎంత సమయం పడుతోందంటే...!!

Covid Tests At The Airport How Long Does It Take

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందటంతో అన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణీకుల పై పలు ఆంక్షలు విధించాయి.తమ దేశంలోకి వచ్చే వారు ఎవరైనా సరే తమ నిబంధనలు పాటించిన తరువాత మాత్రమే అడుగు పెట్టాలని సూచిస్తున్నాయి.

 Covid Tests At The Airport How Long Does It Take-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే భారత్ విదేశీ ప్రయాణీకుల రాకపోకలపై పలు నిబంధనలు అమలు చేసిన విషయం విదితమే.అయితే ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకులు దిగిన వెంటనే RTPCR టెస్ట్ లు చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత సేపు ఎయిర్ పోర్ట్ లో వేచి ఉండాలి అనేటువంటి ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నారైలు, ఇతర దేశాల ప్రయాణీకులు.

ప్రయాణీకులకు కరోనా టెస్ట్ ల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి.ముఖ్యంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో RTPCR, ర్యాపిడ్ RTPCR టెస్ట్ లు చేస్తున్నారు.

 Covid Tests At The Airport How Long Does It Take-ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ టెస్ట్ లు…ఎంత సమయం పడుతోందంటే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సహజంగా RTPCR టెస్ట్ చేయించుకోవాలంటే తప్పకుండా 6 గంటల సమయం పడుతుంది.అలాగే ర్యాపిడ్ RTPCR టెస్ట్ చేయించుకునే వారికి ఫలితం 2 గంటలలో వస్తుంది.కానీ సాధారణ RTPCR టెస్ట్ రూ.999 కాగా ర్యాపిడ్ RTPCR టెస్ట్ రూ.4500 ఉంటుంది.అయితే ఒక్క హైదరాబాద్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ ద్వారా సుమారు 5 వేల మంది ప్రయాణీకులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు.

వీరిలో సుమారు 500 మంది అట రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచీ వచ్చేవారు ఉన్నారట.వీరందరికీ RTPCR టెస్ట్ లు తప్పనిసరి చేశారు.ఒక వేళ పాజిటివ్ తేలితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లలో ఉండాల్సిందే.ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాలకుచెందిన ఎంతో మంది ప్రయాణీకులు చెన్నై నుంచీ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలకు వస్తూ ఉంటారు.అయితే ఇక్కడ RTPCR టెస్ట్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చు రూ.700 కాగా ర్యాపిడ్ RTPCR టెస్ట్ చేయించుకునేందుకు గాను అయ్యే ఖర్చు రూ.3500

.

#Rtpcr #Travelers India #Vijayawada #Omecron #Covid Airport

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube