రాజశేఖర్ కూతురు ఎమోషనల్ ట్వీట్… నాన్నకోసం ప్రార్ధించండి  

Covid positive Rajasekhar fighting hard, Tollywood, Telugu Heroes, Rajasekhar, Shivathmika, Jeevitha Rajasekhar, Shivani Rajasekhar - Telugu @shivathmikar, Covid Positive, Jeevitha Rajasekhar, Rajasekhar, Shivani Rajasekhar, Shivathmika, Telugu Heroes, Tollywood

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడిన పడిన సంగతి తెలిసిందే.అయితే కరోనా కారణంగా రాజశేఖర్ పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది.

TeluguStop.com - Covid Positive Rajasekhar Fighting Hard

మిగిలిన కుటుంబ సభ్యులకి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా రాజశేఖర్ మాత్రం కరోనా లక్షణాలతో కొంత బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు.తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఎమోషనల్ ట్వీట్ చేసింది.

తన తండ్రి కోసం ప్రార్ధించాలని కోరుకుంది.ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని తెలిపింది.

TeluguStop.com - రాజశేఖర్ కూతురు ఎమోషనల్ ట్వీట్… నాన్నకోసం ప్రార్ధించండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కరోనాపై నాన్న చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉంది.

అయినప్పటికీ ఆయన బాగా పోరాడుతున్నారు.

మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడుతాయి.నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు అని ఆమె ట్వీట్ చేసింది.కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేసింది.

మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు.ఓ విషయం తెలుసుకోండి.

ఆయన పరిస్థితి విషమంగా లేదు.ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది.

కోలుకుంటున్నారు.మీ ప్రార్థనలు కావాలి.

మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.భయపడకండి.

అసత్యవార్తలను ప్రచారం చేయకండి అని ట్వీట్ చేసింది.శివాత్మిక ముందుగా నాన్న పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పడంతో ఒక్కసారిగా మీడియా అంతా రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం స్టార్ట్ చేయడంతో వారిని అలెర్ట్ చేయడానికి ఆమె వెంటనే మరో ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది.

#@ShivathmikaR #COVID Positive #Shivathmika #Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Covid Positive Rajasekhar Fighting Hard Related Telugu News,Photos/Pics,Images..