అమ్మ వడి కాదు...ఆక్సిజన్ అందించండి.. కదిలిస్తున్న తల్లి వేదన

ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదరక సంఘటనలు కనిపిస్తున్నాయి.  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.

 Covid Patience Troubled On Oxygen And Abulence Problem Ambulance,  Amma Vodi,  B-TeluguStop.com

  ఈ సమయంలో మీడియా లో కరోనా కు సంబంధించి జనాలను భయపెట్టే వార్తల కంటే , వారికి మనోధైర్యం కల్పించే విధంగా వార్తా కథనాలు ఉండాల్సి ఉన్నా,  ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వ వైఖరి,  బాధితుల ఆక్రందన , ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది.ఇక విషయంలోకి వస్తే , దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.

కొన్నిచోట్ల ఆసుపత్రులలో బెడ్ దొరకని పరిస్థితి నెలకొంది.మరికొన్ని చోట్ల అంబులెన్సు లు దొరక్క ప్రాణాలు పోతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి.

దేశ విదేశాల నుంచి ఆక్సిజన్ ను తెప్పిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్న,  పూర్తిస్థాయిలో వీటిపై దృష్టి కేంద్రీకరించినట్లే కనిపిస్తోంది.అసలు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కరోనా కు సంబంధించి ముందస్తుగా ప్రణాళిక లేకపోవడం,  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు రెండోదశ తీవ్రంగా ఉన్న సమయంలో మేల్కొని , నష్టనివారణ చర్యలకు దిగడం వంటి కారణాలతో ఎంతోమంది అర్థాంతరంగా మరణిస్తున్న పరిస్థితులు నిత్యం మనకు కనిపిస్తున్నాయి.

 తెలంగాణలో టెస్ట్ కోసం వచ్చిన ఓ యువకుడు ఆ టెస్ట్ రిజల్ట్ బయటకు రాకుండా అతని తల్లి ఒడిలో మరణించిన హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది.  ఓ మహిళ ఇంట్లో వారికి కరోనా కారణంగా సీరియస్ అయిందని,  అంబులెన్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదని , ఏదోలా ఆసుపత్రికి తీసుకు వస్తే ఇక్కడ బెడ్ లేదు అని అన్నారు అని, ఆక్సిజన్ పెట్టాల్సిందిగా ప్రాధేయపడినా, కనికరించలేదు అంటూ ఆవేదన పూరితంగా మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అయ్యాయి.

  ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల ను ఆమె ప్రస్తావించారు.  ఆక్సిజన్ దొరక్క,  అంబులెన్సులు సకాలంలో ఆసుపత్రులలో దొరక్క , కరోనా ప్రభావం కి గురైన వారు ఎంతోమంది ఇబ్బందులు పడటమే కాకుండా,  అర్ధాంతరంగా చనిపోతున్న సంఘటనలు ఏపీలో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.ఈ సమయంలోనూ అమ్మఒడి,  భరోసా ఇలా ఉచిత పథకాలకు సొమ్ములు ఇచ్చే బదులు , ఆక్సిజన్ కొరత తీర్చేందుకు, ఆసుపత్రులలో బెడ్లు ఏర్పాటు చేసేందుకు, ప్రజలను కరోనా ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది కదా జగనన్నా !

Telugu Ambulance, Amma Vodi, Bharosa Scheems, Central, Covid, Beds, Jagan, Oxyge

 ఈ సమయంలో ఇటువంటి పథకల కంటే ఆక్సిజన్ అందించడం చాలా ముఖ్యం అంటూ ఆవేదన పూరితంగా ఓ మహిళా మాట్లాడిన మాటలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.కేవలం ఏపీ లోనే కాదు,  తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఈ  తీవ్రతను కేంద్రం ముందుగా అంచనా వేయకపోవడం, రాష్ట్రాలు ఆలస్యంగా మేల్కొన్న డం వంటి కారణాలతో,  ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆక్సిజన్ కొరత లేకుండా చూడడంతో పాటు,  సకాలంలో అంబులెన్సులు జనాలకి అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది ప్రజల అభిప్రాయంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube