అక్కడ కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్లు ఇస్తారట!

ప్రస్తుత కాలంలో ఏ పాటి చిన్న అవకాశం దొరికినా పెద్దపెద్ద మోసాలకు తెరతీసి దందాలు చేస్తుంటారు.ఇక ప్రజల అవసరాలను బట్టి ఇలాంటి మోసాలకు పాల్పడుతూ లక్షల్లో డబ్బు సంపాదిస్తుంటారు.

 Covid 19 Negative Certificates Can Be Found There Bengaloore, Private Hospital,-TeluguStop.com

కరోనా పుణ్యమా అని ఇలాంటి మోసాలు, దందాలు చేసేవారు కోకొల్లలుగా పుట్టుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే కరోనా పరీక్షలను నిర్వహిస్తూ కొన్ని ఆస్పత్రిలో డబ్బును పోగు చేస్తున్నాయి.

ఇలాంటి నిర్వాకం ప్రస్తుతం బెంగళూరులో కొన్ని ప్రముఖ ఆసుపత్రులలో చోటు చేసుకుంది.

బెంగళూరు లోని కొన్ని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది.

అక్రమంగా సంపాదించడమే వారి ధ్యేయంగా పెట్టుకుని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఈ రకమైన మోసాలకు తెరలేపాయి.ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కరోనా పరీక్షలు తప్పనిసరి అని తెలియడంతో ఈ అవకాశాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు బాగా సద్వినియోగం చేసుకుంటున్నాయి.

ఇలాంటి కొన్ని ఆస్పత్రులలో కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వస్తుందేమో అని భయపడాల్సిన పనిలేదు.ఒకవేళ పాజిటివ్ వచ్చినా అది నెగిటివ్ గా మారుతుంది.

కరోనా నెగిటివ్ అని సర్టిఫికెట్ కావాలంటే 2500 వరకు వసూలు చేసి ఇ నెగిటివ్ రిపోర్ట్ ను అందజేస్తున్నారు,సిటీ లోని కొన్ని ప్రముఖ ఆసుపత్రులు.

ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే 14 రోజులు క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాల్సిన వాళ్లు, ఇంకా ఎవరికీ సంబంధించిన రీతిలో వారు ఇలా 2500 రూపాయలు చెల్లించి కరోనా నెగిటివ్ అనే సర్టిఫికెట్ పొందుతున్నారు.

ఇలా సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ వారికి కరోనా పాజిటివ్ ఉంటే ఈ వ్యాధి మరింత ప్రబలే అవకాశం ఉంది.ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రైవేట్ ఆస్పత్రుల పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube