సిడ్నీ లాక్‌డౌన్ : పోనీలే అని వదిలేస్తే జనం వినేటట్లు లేరు.. ఏకంగా ఆర్మీనే దింపారు

తొలి విడతలో కరోనాను కట్టుదిట్టంగా నియంత్రించగలిగిన ఆస్ట్రేలియా తాజాగా డెల్టా వేరియంట్ ధాటికి వణికిపోతోంది.ముఖ్యంగా దేశ వాణిజ్య నగరం సిడ్నీలో పరిస్ధితి రోజు రోజుకు చేయిదాటుతోంది.

 Covid In Sydney: Military Deployed To Help Enforce Lockdown,covid Cases, Austral-TeluguStop.com

దీంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో సిడ్నీలో లాక్‌డౌన్‌ విధించారు.దీనిని మరో నాలుగు వారాలకు పెంచుతూ ఈ బుధవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు.నిరసనలతో హోరెత్తిస్తున్నారు.సిడ్నీ సహా ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి.తమకు స్వేచ్ఛ కావాలని లాక్‌డౌన్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రజలు.

ఫ్రీడం, అన్‌మాస్క్ ది ట్రూత్ నినాదంతో ఆస్ట్రేలియన్లు నిరసన చేస్తున్నారు.పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించడంతో… తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రోడ్లపై బారికేడ్లను తోసేసి, ప్లాస్టిక్ సీసాలను, ఇతర వస్తువులను పోలీసులపైకి విసిరేయడంతో పరిస్థితులు అదుపు తప్పి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతోంది.దీంతో వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు .ప్రస్తుత పరిస్ధితుల్లో కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ తప్పనిసరి అని.ప్రజలు సహకరించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Telugu Australia, Australian, Covid, Covidsydney, Delta, Lcokdown, Nsw Mick Full

అటు ప్రజలను నియంత్రించడం పోలీసుల వల్ల కాకపోవడంతో ఆర్మీని రంగంలోకి దించింది సర్కార్.ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ ద‌ళాలు ఇక నుంచి సిడ్నీలో పెట్రోలింగ్ నిర్వ‌హించ‌నున్నాయి.హాట్‌స్పాట్‌ల‌ను ఎంపిక చేసి అక్క‌డ వైర‌స్ నియంత్ర‌ణ కోసం కావాల్సిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటారు.ప్రజలు తమ ఇళ్ల నుంచి ఐదు కిలోమీటర్లు దాటి వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది.

కొత్తగా విధించిన లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సైనికులను మోహరిస్తున్నామని న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మిక్ ఫుల్లర్ చెప్పారు.ఇప్పటికే విక్టోరియా రాష్ట్రంలోనూ సైనికులను మోహరించారు.

Telugu Australia, Australian, Covid, Covidsydney, Delta, Lcokdown, Nsw Mick Full

మరోవైపు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు ఆర్మీని రంగంలోకి దింప‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.అయితే లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే లక్షన్నర కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ.రెండో మాంద్యంలోకి కూరుకుపోయే పరిస్థితి రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అందుకే సైన్యాన్ని దింపడం మినహా మరో మార్గం కనిపించలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube