ఉద్యోగ అవకాశాలపై కరోనా ప్రభావం... తేల్చి చెప్పిన నౌక్రీ

డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువత తరువాత ఉద్యోగాల వేటలో పడతారు.దాని కోసం ఆన్ లైన్ జాబు పోర్టల్ ని ఆశ్రయిస్తూ, వాటి ద్వారా కంపెనీలకి ఉద్యోగాల కోసం హాజరు అవుతారు.

 Covid Impact On Youth Employment India, Corona Effect, Covid-19, Corona Crisis,-TeluguStop.com

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ రంగంలో పూర్తిగా ఉద్యోగాల కల్పన నిలిచిపోయింది.కాలేజీ క్యాంపస్ ల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లలో 66 శాతం మందికి జాబ్ ఆఫర్ లెటర్లు లేవని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ తెలిపింది.

మూడింట ఒక్క వంతు విద్యార్థులు ఆఫర్ లెటర్లు అందుకున్నారని చెప్పింది.లాక్ డౌన్ కారణంగా జాబ్ ఆఫర్ లెటర్స్ వచ్చిన కూడా జాయినింగ్ ఇంకా ఖరారు కాలేదని చెప్పింది.

విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 17 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లోనే ఉద్యోగాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మిగిలిన వారు ఆన్ లైన్ పోర్టల్ ని ఆశ్రయిస్తున్నారని, కొందరు విద్యార్థులు ఫ్రీలాన్సింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని 2020 బ్యాచ్ కు సంబంధించి 82 శాతం కాలేజీల విద్యార్థుల భవిష్యత్తుపై కరోనా మహమ్మారి ప్రభావం చూపిందని తెలిపింది.74 శాతం మంది ఫైనలియర్ విద్యార్థుల ఇంటర్న్ షిప్ ఆఫర్లను ప్రభావితం చేసిందని చెప్పింది.కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోలేదని వర్చువల్ మీడియా ఆధారంగా కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది.అయితే కరోనా కష్టకాలంలో యువతరం ఎక్కువగా ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది.

కరోనా ప్రభావం యువతరం ఉద్యోగాలపై ఉన్న కూడా పెద్దగా భయపడటం లేదని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube