కరోనా ఎఫెక్ట్.. గంటలోనే ఖాళీ అయిన సికింద్రాబాద్-దానాపూర్ రైలు టికెట్లు.. !

కరోనా కారణంగా నగరానికి వలస వచ్చిన కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి.మెదటి సారి వచ్చిన కరోనా వల్ల ఎందరో వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లుతూ దీన స్దితిలో మరణించిన విషయం మరవక ముందే ఇప్పుడు కూడా భయంతో సొంత రాష్ట్రాల బాట పట్టారు.

 Covid Effect Secunderabad Danapur Train Tickets Sold Within One Hour, Corona Eff-TeluguStop.com

దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడి పోతుంది.ముఖ్యంగా బీహార్ వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరుగు పయనమవుతున్నారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న రైలు సరిపోకపోవడంతో రైల్వే అధికారులు ఇటీవల మరో రైలు వేశారు.దీంతో మూడు రైళ్లు అందుబాటు లోకి వచ్చాయి.

కాగా నేడు బీహార్ వెళ్లనున్న సికింద్రాబాద్-దానాపూర్ రైళ్లలో గంటలోనే టికెట్లన్నీ అమ్ముడు పోగా, ఇంకా 541 మంది వెయింటింగ్ లిస్టులో ఉండడం గమనార్హం.ఇకపోతే తెలంగాణలో ప్రస్తుతం పది రోజులపాటు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారన్న వార్తలు ప్రవారం జరుగుతుండటం, మరో వైపు కార్మికులకు ఉపాధి కరువవడంతో సొంత రాష్ట్రాల బాట పట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube