మూతబడుతున్న అమెరికా జైళ్ళు..ఖైదీలను ఏమి చేస్తున్నారో తెలుసా..!!

అమెరికాలో కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో వ్యాపారసంస్థలు, పలు కంపెనీలు, ఫ్యాక్టరీ లు మూతబడిన విషయం విధితమే.ఈ కారణంగా ఎంతో మంది అమెరికన్స్ నిరుద్యోగులుగా మిగిలిపోయారు.

 Us States Are Shutting Down Prisons As Guards Are Crippled By Covid-19,  Covid-1-TeluguStop.com

వారికి పూట గడవడమే కష్టంగా మారుతోంది.అయితే ఇప్పటి వరకూ పలు రకాల సంస్థలు మూతబడిన వార్తలు విన్నాం కానీ ఏకంగా జైళ్ళ కు జైళ్ళు మూతబడుతున్న వైనం అందరిని ఆశ్చర్యపరుచుతోంది.

ఏ దేశంలో కూడా కరోనా కారణంగా జైళ్ళు ముసేస్తున్న సంఘటనలు జరగలేదు,కానీ అమెరికాలో మాత్రం కరోనా సృష్టిస్తున్న విలయం జైళ్లను కూడా తాకింది.

కరోనా దెబ్బకి అమెరికా జైళ్లలో ఉన్న రోగులు అల్లల్లాడిపోతున్నారు.

అత్యధికంగా ఖైదీలు ఉన్న జైళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.కేవలం ఖైదీలు మాత్రమే కాదు జైళ్లలో ఉండే గార్డులు సైతం కరోన బారిన పడటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరి జైళ్ళు మూతబడితే ఖైదీల పరిస్థితి ఏమిటి అనే సందేహం రావచ్చు.జైళ్లను మూసివేసి ఖైదీలను పలు రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారట.

కాలిఫోర్నియా ,మిస్సోరి , పెన్సిల్వేనియా లోని పలు ప్రాంతాలలో జైళ్ళు మూసేస్తున్నారు.అమెరికా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో సుమారు 4 లక్షల మందికి కరోనా సోకిందని తెలుస్తోంది.

సుమారు 3 వేల మందికి పైగా ఖైదీలు కరోనాతో మృతి చెందారని, వారితో పాటు పలువురు అధికారులు కూడా మృతి చెందారని జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.ఇదిలాఉంటే

ఖైదీలు ఎంత మందిని రహస్య ప్రదేశాలకు తరలిచినా వారికి కరోనా సోకితే అది చాలా ప్రమాదమని, ఖైదీలలో శిక్షకు దగ్గరగా ఉన్నవారిని, వృద్దులను, అలాగే విచారణ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నవారిని ముందుగానే వదిలేస్తే కొంత మేర జైళ్లలో కరోనా ను నివారించవచ్చు అనే ఆలోచనలో అధికారులు ఉన్నారట.

సుమారు లక్ష మంది అధికారులు కరోనా బారిన పడగా అందులో 200 మంది మృతి చెందారని ఈ క్రమంలోనే ఖైదీల విడుదల పై దృష్టి పెట్టారని జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube