సాయం చేయండి....అమెరికా కార్మిక శాఖకు వెల్లువెత్తిన దరఖాస్తులు..!!

అమెరికాకు కరోనా మిగిల్చిన నష్టం పూడ్చటానికి ఆదేశ ఆర్ధిక నిపుణులు తల్లకిందులుగా తపస్సులు చేస్తున్నారు.అమెరికాకు మునుపెన్నడూ ఈ స్థాయిలో భారీ ఆర్ధిక నష్టం జరుగలేదు దాంతో ఆ ఆర్ధిక భారం నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Record Number Of Job Applications To Us Labor Department, Job Applications,un Em-TeluguStop.com

మరో పక్క కరోనా కారణంగా రోడ్డున పడిన కుటుంభాలు లెక్కకు మించే ఉన్నాయి.ఉద్యోగాలు కోల్పయిన వ్యక్తులు, మూతబడిన సంస్థలు ,తెరుచుకోని పలు ఫ్యాక్టరీలతో ఎంతో మంది అమెరికన్స్ నిరుద్యోగులుగా మారిపోయారు.

దాంతో

అమెరికా కార్మిక శాఖకు నిరుద్యోగ బృతి కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.తమ ఆర్ధిక పరిస్థితి బాలేదని సాయం చేయండి అంటూ రోజు రోజుకు వేలాది మంది తమకు అభ్యర్ధన పత్రాలు ఇస్తున్నారని ఆ శాఖా అధికారులు వెల్లడిస్తున్నారు.వారు చెప్పిన వివాల ప్రకారం చూస్తే నవంబర్ 25 నాటికి అమెరికా కార్మిక శాఖకు 7 .78 లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డాయని వీరందరూ మాకు తిండి లేదు, ఇల్లు లేవు, డబ్బులు లేక అద్దెలు కట్టలేక రోడ్ల పక్కన ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు గడిచిన కొన్ని వారాలుగా పోల్చుకుంటే ఈ వారంలో 30 వేల దరఖాస్తులు అధికంగా వచ్చాయని తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరువాత మరిన్ని దరఖాస్తులు పెరుగుతున్నాయని, ప్రముఖ వాణిజ్య సంస్థలు, పలు ఫ్యాక్టరీలు మరిన్ని మూతబడ్డాయని దాంతో లక్షలాది మందిపై ఈ ప్రభావం పడటంతోనే నిరుద్యోగ బృతికోసం దరఖాస్తులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది.ఇదిలాఉంటే ఇప్పటికి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 2.70 లక్షలకు చేరువలో ఉందని, కరోనా బాధితుల సంఖ్య 13 .22 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube