ఆగని మారణహోమం..అమెరికాలో రికార్డ్ స్థాయి మరణాలు..!!!  

Corona Deaths Increased in America, Corona Cases, America, Covid Deaths, Americans - Telugu America, Americans, Corona Cases, Corona Deaths Increased In America, Covid Deaths

కరోనా మహమ్మారి అమెరికాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయి.

TeluguStop.com - Covid Deaths America

ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కరోనా కేసుల సంఖ్య నమోదు కావడంలేదంటే పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.కేవలం 24 గంటలు గడించే లోగానే సుమారు 4500 మరణాలు నమోదు కావడంతో అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఒక పక్క కరోనా మరో పక్క స్ట్రెయిన్ లతో కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

TeluguStop.com - ఆగని మారణహోమం..అమెరికాలో రికార్డ్ స్థాయి మరణాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఒక పక్క మరణాలు, మరో పక్క కొత్తగా వస్తున్నా స్ట్రెయిన్ కేసులతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఏం చేయాలో కూడా పాలుపోని స్థితిలో ఉన్నారు.గతంలో కంటే కూడా నిన్నటి ఒక్కరోజులో 4500 మంది మృతి చెందటం అమెరికా కరోనా చరిత్రలో జరగలేదని అంటున్నారు నిపుణులు.

హాప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం అమెరికాలో మహమ్మారి మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదని అంటోంది.

అమెరికాలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం అవుతున్నా సరే కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదని అంటున్నారు నిపుణులు.చాలామంది అమెరికన్స్ వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆసక్తిని కనబరచడం లేదని, మరో కొందరు బహిరంగంగానే రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నారని అలాంటి వారికి నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫలితంగానే అమెరికాలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోందని హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.ఇదిలాఉంటే ఇప్పటివరకూ కరోనా కారణంగా నమోదైన కేసుల సంఖ్య 2.30 కోట్లకు చేరుకోగా మృతుల సంఖ్య 3 .80 లక్షలకు చేరుకుంది.

#Corona Cases #Covid Deaths #CoronaDeaths #America #Americans

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు